OG Worldwide Business: ఓజీ వరల్డ్ వైడ్ బిజినెస్ ఎంత? పవన్ కల్యాణ్ మూవీకి ఎన్ని కోట్లు వస్తే లాభాల్లోకి అంటే?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా RRR లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను అందించిన టాప్ ప్రొడక్షన్ కంపెనీ డీవీవీ ఎంటర్‌టైనర్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మాతగా సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఓజీ (OGO. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు.
ఈ చిత్రంలో మలయాళ నటుడు అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, శుభలేఖ సుధాకర్, శ్రీయా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ కీలక పాత్రల్లో నటించారు. . ఇక ఈ చిత్రానికి రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫి, ఎఢిటింగ్ నవీన్ నూలీ, సంగీతం థమన్ ఎస్ బాధ్యతలను నిర్వర్తించారు. మాఫియా బ్యాక్ డ్రాప్‌తో ముంబై, ఇతర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకొన్న ఈ సినిమాను సుమారుగా 250 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలో ఉండగానే.. థియేట్రికల్ హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడింది.

తెలుగు రాష్ట్రాల్లో ఓజీ సినిమాను పలు ప్రాంతాల్లో పలువురు టాప్ డిస్ట్రిబ్యూటర్లు ప్రదర్శించేందుకు హక్కులను సొంతం చేసుకొన్నారు. ఉత్తరాంధ్ర, నైజాంలో దిల్ రాజు, తూర్పు గోదావరి జిల్లాలో అనుశ్రీ ఫిలిమ్స్, పశ్చిమ గోదావరి జిల్లాలో ఆకాశ్ సినిమాస్, కృష్ణా జిల్లాలో అలంకార్ ప్రసాద్, గుంటూరు జిల్లాలో రాధాకృష్ణ ఎంటర్‌ప్రైజెస్, నెల్లూరులో వెంగమాం ఫిలిమ్స్, సీడెడ్‌లో నాగవంశీ ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు రైట్స్ సొంతం చేసుకొన్నారు.
ఇక తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ రైట్స్ బిజినెస్ భారీగా జరిగింది. ఆంధ్రా రైట్స్ 80 కోట్ల రూపాయలకు, సీడెడ్‌లో 22 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. ఆంధ్రప్రదేశ్ రైట్స్ 102 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది. ఇక నైజాం థియేట్రికల్ రైట్స్ 55 కోట్ల రూపాయల మేర జరిగింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 157 కోట్ల రూపాయల (జీఎస్టీతో కలిపి) మేర బిజినెస్ జరిగింది.
ఇదిలా ఉండగా, కర్ణాటక హక్కులు 8 కోట్ల రూపాయల మేర జరిగింది. తమిళ, కేరళలో హక్కులు 3 కోట్ల రూపాయల మేర జరిగింది. ఇక నార్త్ అమెరికా థియేట్రికల్ రైట్స్ 2.9 మిలియన్ డాలర్లు అంటే.. 25.5 కోట్ల రూపాయల మేర జరిగింది. యూఎస్‌లో బ్రేక్ ఈవెన్ కావాలంటే.. కనీసం 4.5 మిలియన్ డాలర్లు వసూలు చేయాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
తెలుగు రాష్ట్రాల్లో 157 కోట్ల రూపాయలు, కర్ణాటక, కేరళ, తమిళనాడు హక్కులు 11 కోట్ల రూపాయలు, నార్త్ అమెరికా 25.5 కోట్ల రూపాయలు మేర జరిగింది. అంటే మొత్తంగా 193.5 కోట్ల రూపాయల మేర జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. ఈ సినిమా కనీసం 200 కోట్ల రూపాయల షేర్.. 400 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


Click it and Unblock the Notifications











