OG USA Box Office: OG కలెక్షన్లకు యూఎస్ బాక్సాఫీస్ హడల్.. పవన్ కల్యాణ్ సరికొత్త చరిత్ర

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా RRR లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను అందించిన టాప్ ప్రొడక్షన్ కంపెనీ డీవీవీ ఎంటర్‌టైనర్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మాతగా సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఓజీ (OGO. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

సినిమా ద్వారా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. ఈ చిత్రంలో మలయాళ నటుడు అర్జున్ దాస్, సీనియర్ నటులు ప్రకాశ్ రాజ్, శుభలేఖ సుధాకర్, శ్రీయా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ లాంటి వాళ్లు నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫి, ఎఢిటింగ్ నవీన్ నూలీ, సంగీతం థమన్ ఎస్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఇక ఈ సినిమా బడ్జెట్, వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాల్లోకి వెళితే..

OG Movie 1 million dollar Club

ఈ సినిమాలోని నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ కాస్ట్ అంతా కలిపి ఈ సినిమాను 250 నుంచి 300 కోట్ల రూపాయల మేర బడ్జెట్‌తో నిర్మించారు. ఇక నార్త్ అమెరికాతో కలిపి ఓవర్సీస్ రైట్స్ సుమారుగా 80 కోట్ల రూపాయల మేర జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా ప్రీ సేల్స్‌కు అమెరికా, కెనడాలో భారీ స్పందన కనిపిస్తున్నది. ఈ చిత్రం రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు రాబడుతున్నది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విడుదలైన గ్లింప్స్, టీజర్, పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. హంగ్రీ చీటా లాంటి పాటలు ట్రెండ్ సెట్ చేశాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో ఓజీ చిత్రం సునామీ వేగంతో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. నెల రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్ మొదలుపెట్టిన ఈ చిత్రం అత్యంత వేగంగా కలెక్షన్లు సాధిస్తున్నది. ఈ సినిమా వేగంగా 50K, 100K, 200K, 250K వసూళ్లను సాధించింది.

ఇక ఈ సినిమా నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనాన్ని కొనసాగిస్తున్నది. ఈ చిత్రానికి సంబంధించి 310 లోకేషన్లలో, 1150 షోలకు అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభించగా.. ఈ చిత్రం 30 వేలకుపైగా టికెట్లు అమ్ముడుపోయాయి. ఈ సినిమా అత్యంత వేగంగా 1 మిలియన్ డాలర్లు అంటే సుమారుగా 8.8 కోట్ల రూపాయల వసూళ్లును రాబట్టింది అని డీవీవీ ఎంటర్‌ప్రైజెస్ అధికారికంగా ప్రకటించింది.

ఇక ఈ సినిమా కోసం టికెట్స్ బుక్ చేయడానికి ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను క్రియేట్ చేశారు. ఈ వెబ్ సైట్‌ను పవన్ కల్యాణ్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఇలా ఓ సినిమా టికెట్ బుకింగ్ కోసం వెబ్ సైట్ క్రియేట్ చేయడం తెలుగు సినిమా పరిశ్రమలో ఇదే తొలిసారి అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

More from Filmibeat

Read more about: og pawan kalyan sujeeth
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X