OG USA Box Office: యూఎస్‌లో దేవర కలెక్షన్లను బ్రేక్ చేసిన OG.. పుష్ప 2 రికార్డుపై గురిపెట్టిన పవన్ కల్యాణ్ మూ
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా RRR లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను అందించిన టాప్ ప్రొడక్షన్ కంపెనీ డీవీవీ ఎంటర్‌టైనర్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మాతగా సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఓజీ (OGO. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
సినిమా ద్వారా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. ఈ చిత్రంలో మలయాళ నటుడు అర్జున్ దాస్, సీనియర్ నటులు ప్రకాశ్ రాజ్, శుభలేఖ సుధాకర్, శ్రీయా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ లాంటి వాళ్లు నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫి, ఎఢిటింగ్ నవీన్ నూలీ, సంగీతం థమన్ ఎస్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఇక ఈ సినిమా బడ్జెట్, వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాల్లోకి వెళితే..

ఈ సినిమాలోని నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ కాస్ట్ అంతా కలిపి ఈ సినిమాను 250 నుంచి 300 కోట్ల రూపాయల మేర బడ్జెట్‌తో నిర్మించారు. ఇక నార్త్ అమెరికాతో కలిపి ఓవర్సీస్ రైట్స్ సుమారుగా 80 కోట్ల రూపాయల మేర జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే OG సినిమా కోసం ఎన్నో నెలల నుంచి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్‌ను విడుదల చేస్తున్న నేపథ్యంలో వాటికి బ్రహ్మండమైన రెస్పాన్స్ లభిస్తున్నది. ఈ సినిమాకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని నార్త్ అమెరికాలో ఓ నెల ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ మొదలుపెట్టారు. ఈ సినిమా ప్రీ సేల్స్‌కు అమెరికా, కెనడాలో భారీ స్పందన కనిపిస్తున్నది. ఈ చిత్రం రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు రాబడుతున్నది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
అమెరికాలో ఓజీ చిత్రం సునామీ వేగంతో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. నెల రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్ మొదలుపెట్టిన ఈ చిత్రం అత్యంత వేగంగా కలెక్షన్లు సాధిస్తున్నది. ఈ సినిమా వేగంగా 50K, 100K, 200K, 250K వసూళ్లను సాధించింది. ఈ చిత్రానికి సంబంధించిన 631 షోల కోసం 175 లొకేషన్లలో అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభించారు. ఇప్పటికే ఈ మూవీ 10 వేల టికెట్లను అమ్మడం జరిగింది. సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 275000 డాలర్ల వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక పవన్ కల్యాణ్ మూవీ ఇటీవల నార్త్ అమెరికాలో భారీ వసూళ్లను సాధించిన దేవర, పుష్ప 2 సినిమా రికార్డులపై కన్నేసింది. 27 రోజుల ముందు దేవర చిత్రం 3 వేల టికెట్లు అమ్మడం ద్వారా 75 వేల డాలర్లు వసూలు చేసింది. పుష్ప 2 చిత్రం 800 లోకేషన్లలో 3060 షోలకు 20 వేల టికెట్లు అమ్మడం ద్వారా 530k కలెక్షన్లు రాబట్టింది. ఇప్పటి వరకు దేవర సినిమాను OG మూవీ అధిగమించిందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
అమెరికాలో ఒక రోజు ముందే ప్రదర్శించే ప్రీమియర్లకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమా ఓవర్సీస్‌లో ప్రీమియర్లతో కలిపి తొలి రోజు నాటికి బ్రేక్ ఈవెన్ సాధిస్తుంది. ఈ చిత్రం లాభాల్లోకి రావడానికి వరల్డ్ వైడ్‌గా 10 మిలియన్ డాలర్లు వసూలు చేయాల్సి ఉంటుంది. ఈ చిత్రం భారీ లాభాలను సాధిస్తుందనే అంచనాలు ట్రేడ్ వర్గాల్లో ఏర్పడటం వల్ల మరింత క్రేజ్ కనిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











