OG USA Advance Booking Collections: అమెరికాలో OG అడ్వాన్స్ బుకింగ్ సంచలనం.. పవన్ కల్యాణ్ బాక్సాఫీస్ వేట..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా RRR లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను అందించిన టాప్ ప్రొడక్షన్ కంపెనీ డీవీవీ ఎంటర్‌టైనర్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మాతగా సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఓజీ (OGO. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
సినిమా ద్వారా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. ఈ చిత్రంలో మలయాళ నటుడు అర్జున్ దాస్, సీనియర్ నటులు ప్రకాశ్ రాజ్, శుభలేఖ సుధాకర్, శ్రీయా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ లాంటి వాళ్లు నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫి, ఎఢిటింగ్ నవీన్ నూలీ, సంగీతం థమన్ ఎస్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఇక ఈ సినిమా బడ్జెట్, వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాల్లోకి వెళితే..

పవన్ కల్యాణ్ నటిస్తున్న ఈ చిత్రంలో ఆయన ఓజాస్ గంభీరా (OG) అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో మార్షల్ ఆర్ట్స్‌కు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. జపనీస్, కొరియన్ దేశాల్లోని స్టంట్ మాస్టర్లు ఫైట్స్‌ను కంపోజ్ చేశారు. ఈ సినిమాలోని నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ కాస్ట్ అంతా కలిపి ఈ సినిమాను 250 నుంచి 300 కోట్ల రూపాయల మేర బడ్జెట్‌తో నిర్మించారు. ఇక నార్త్ అమెరికాతో కలిపి ఓవర్సీస్ రైట్స్ సుమారుగా 80 కోట్ల రూపాయల మేర జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
అయితే OG సినిమా కోసం ఎన్నో నెలల నుంచి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్‌ను విడుదల చేస్తున్న నేపథ్యంలో వాటికి బ్రహ్మండమైన రెస్పాన్స్ లభిస్తున్నది. ఈ సినిమాకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని నార్త్ అమెరికాలో ఓ నెల ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ మొదలుపెట్టారు. ఈ సినిమా ప్రీ సేల్స్‌కు అమెరికా, కెనడాలో భారీ స్పందన కనిపిస్తున్నది. ఈ చిత్రం రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు రాబడుతున్నది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
అమెరికాలోని ప్రధాన నగరాలైన ఫ్లోరిడా,మాస్సాచుస్సెట్స్, డల్లాస్, న్యూజెర్సీ, న్యూయార్క్, పెన్సిల్వేనియా, టెక్సాస్ నగరాలతో ఇతర ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్‌ను ఓపెన్ చేశారు. సినీ మార్క్, రీగల్ చైన్ థియేటర్లలో టికెట్ల అమ్మకాలు ప్రారంభించారు. ఇప్పటి వరకు 34 లోకేషన్లలో 130 షోల కోసం అడ్వాన్స్ బుకింగ్‌ను ప్రారంభించారు. అయితే డల్లాస్‌లోని సినీ మార్క్‌లో 40 షోలు ప్రదర్శించడానికి నిర్ణయం తీసుకొన్నారు అని ట్రేడ్ వర్గాలు సోషల్ మీడియాలో వెల్లడించారు.
అయితే ఇప్పటి వరకు అమెరికాలో భారీగా టికెట్ల అమ్మకాలు జరిగా. ఈ సినిమా కోసం కడపటి వార్తలు అందేసరికి 2500 టికెట్లు అమ్ముడుపోయాయి. దాదాపు 65000 డాలర్లు అంటే.. భారతీయ కరెన్సీలో 57 లక్షల రూపాయలకుపైగా కలెక్షన్లు నమోదు అయ్యాయి. ఈ టికెట్ల అమ్మకాలు ఇక ముందు ఊపందుకొంటాయి అని తెలిపారు. త్వరలోనే ఇతర ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభిస్తారు. ఆ సమయంలో రికార్డు స్థాయి కలెక్షన్లు నమోదు అవుతాయని అమెరికా డిస్ట్రిబ్యూటర్లు వెల్లడించారు.
అయితే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో ట్రేడ్ పండితులు కూడా భారీగా అంచనా వేస్తున్నారు. అయితే ఈ చిత్రం ప్రీమియర్ల నాటికే నార్త్ అమెరికాలో బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉంది. ఒకవేళ ప్రీమియర్ల సాధించకపోతే.. తొలిరోజే ఈ సినిమా లాభాల్లోకి వచ్చే ఛాన్స్ ఉందని గట్టి నమ్మకంతో ఉన్నారు.


Click it and Unblock the Notifications











