OG North America Collections: కల్కి, పుష్ప 2 రికార్డుపై OG గురి.. పవన్ కల్యాణ్ బాక్సాఫీస్ పవర్ క్రేజీగా!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా RRR లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను అందించిన టాప్ ప్రొడక్షన్ కంపెనీ డీవీవీ ఎంటర్‌టైనర్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మాతగా సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఓజీ (OG) గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
సినిమా ద్వారా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. ఈ చిత్రంలో మలయాళ నటుడు అర్జున్ దాస్, సీనియర్ నటులు ప్రకాశ్ రాజ్, శుభలేఖ సుధాకర్, శ్రీయా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ లాంటి వాళ్లు నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫి, ఎఢిటింగ్ నవీన్ నూలీ, సంగీతం థమన్ ఎస్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఇక ఈ సినిమా బడ్జెట్, వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాల్లోకి వెళితే..

ఈ సినిమాలోని నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ కాస్ట్ అంతా కలిపి ఈ సినిమాను 250 నుంచి 300 కోట్ల రూపాయల మేర బడ్జెట్‌తో నిర్మించారు. ఇక నార్త్ అమెరికాతో కలిపి ఓవర్సీస్ రైట్స్ సుమారుగా 80 కోట్ల రూపాయల మేర జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా ప్రీ సేల్స్‌కు అమెరికా, కెనడాలో భారీ స్పందన కనిపిస్తున్నది. ఈ చిత్రం రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు రాబడుతున్నది. కల్కి, పుష్ప 2, దేవర సినిమాలకు ధీటుగా వసూళ్లు రాబడుతుందని అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
అమెరికాలో 10 రోజుల ముందు ప్రీ బుకింగ్ డేటా పరిశీలిస్తే.. ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం 547 లొకేషన్లలో 3420 షోలకు గాను, 46111 టికెట్లు అమ్మడం ద్వారా 1.35 మిలియన్ డాలర్లు అంటే 11.90 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక పుష్ప 2 చిత్రం విషయానికి వస్తే.. 900 లోకేషన్లలో 3420 షోలకు గాను, 50008 టికెట్లు అమ్మడం ద్వారా 1.38 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 12.16 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ప్రభాస్ నటించిన కల్కి 2898 AD చిత్రం 660 లొకేషన్లలో 2402 షోలకు గాను.. 45582 టికెట్లు అమ్మడం ద్వారా 1.4 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో 12.33 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
అయితే OG మూవీ విషయానికి వస్తే.. కల్కి, పుష్ప 2, దేవర చిత్రం కంటే తక్కువ లొకేషన్లలో అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభించారు. అయినా ఈ మూడు సినిమాలకు ఏ మాత్రం తీసిపోకుండా కలెక్షన్లను రాబడుతున్నది. ఈ చిత్రం 439 లోకేషన్లలో 1712 షోలకు గాను, 47109 టికెట్లు అమ్మడం ద్వారా 1.36 మిలియన్ డాలర్లు అంటే 11.99 కోట్ల రూపాయలు రాబట్టింది అని వెంకీ బాక్సాఫీస్ వెల్లడించింది.
ఇక నార్త్ అమెరికా అంటే అమెరికా, కెనడా కలిపితే.. దేవర చిత్రం 1.46 మిలియన్ డాలర్లు (12.86 కోట్లు), పుష్ప 2 చిత్రం 1.45 (12.77 కోట్లు) మిలియన్ డాలర్లు, కల్కి2898 AD 1.51 మిలియన్ డాలర్లు (13.30 కోట్లు) వసూలు చేసింది. అయితే అతి తక్కువ లోకేషన్లలో ఓజీ చిత్రం 1.5 మిలియన్ డాలర్లు (13.21 కోట్లు) రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
అయితే ప్రస్తుతం అమెరికాలో ఈ ట్రెండ్ చూస్తే.. రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్ది ఈ చిత్రం మరిన్ని రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ చిత్రానికి లాంగ్ వీకెండ్, లాంగ్ వీక్ ఉండటం, దసరా సెలవులు కలిసి రావడంతో పవన్ కల్యాణ్ కెరీర్‌లో హయ్యెస్ట్ ఓపెనింగ్స్ మాత్రమే కాకుండా అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా OG మారే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.


Click it and Unblock the Notifications











