OG USA Pre Sales Collections: యూఎస్‌లో OG కలెక్షన్ల ఊచకోత.. పవన్ కల్యాణ్ మూవీ సరికొత్త సంచలనం

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా RRR లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను అందించిన టాప్ ప్రొడక్షన్ కంపెనీ డీవీవీ ఎంటర్‌టైనర్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మాతగా సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఓజీ (OG). గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

సినిమా ద్వారా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. ఈ చిత్రంలో మలయాళ నటుడు అర్జున్ దాస్, సీనియర్ నటులు ప్రకాశ్ రాజ్, శుభలేఖ సుధాకర్, శ్రీయా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ లాంటి వాళ్లు నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫి, ఎఢిటింగ్ నవీన్ నూలీ, సంగీతం థమన్ ఎస్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఇక ఈ సినిమా బడ్జెట్, వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాల్లోకి వెళితే..

OG USA Pre Sales Booking Box Office Collections

ఈ సినిమాలోని నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ కాస్ట్ అంతా కలిపి ఈ సినిమాను 250 నుంచి 300 కోట్ల రూపాయల మేర బడ్జెట్‌తో నిర్మించారు. ఇక నార్త్ అమెరికాతో కలిపి ఓవర్సీస్ రైట్స్ సుమారుగా 80 కోట్ల రూపాయల మేర జరిగింది. ఈ సినిమాకు రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా పూర్తి అయింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఈ సినిమా ప్రీ సేల్స్‌కు అమెరికా, కెనడాలో భారీ స్పందన కనిపిస్తున్నది. ఈ చిత్రం రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు రాబడుతున్నది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ సినిమా కోసం 90కి పైగా XD లోకేషన్లలో 300 షోలకు ప్రీ సేల్ బుకింగ్ ఓపెన్ అయ్యాయి. రానున్న రోజుల్లో ఈ సినిమాకు మరిన్ని చోట్ల అడ్వాన్స్ బుకింగ్ తెరుస్తారు. నార్త్ అమెరికాలో ఇది ఒక రికార్డు అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

నార్త్ అమెరికాలో ఈ సినిమా ప్రదర్శనకు సంబంధించి భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 390 లోకేషన్లలో ప్రీసేల్స్ జరుగుతున్నది. 1400 షోల కోసం అడ్వాన్స్ బుకింగ్ జరుగుతున్నది. ఈ చిత్రం ఇప్పటికే 26 వేల టికెట్లు అమ్ముడుపోయాయి. దాంతో ఈ సినిమాకు 735k అమెరికన్ డాలర్లు అంటే.. భారతీయ కరెన్సీలో సుమారుగా 6.5 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

oG సినిమా అమెరికాలో రికార్డుల పర్వాన్ని కొనసాగిస్తున్నది. ఈ చిత్రానికి టీజర్, ట్రైలర్ రిలీజ్ కాకుండానే విడుదలకు ఇంకా 25 రోజులు ఉండగానే ఈ సినిమా 1 మిలియన్ డాలర్లు వసూలు చేయడానికి సిద్దంగా ఉండటం ఆల్ టైమ్ రికార్డుగా పేర్కొంటున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ కానున్నది.

More from Filmibeat

Read more about: og pawan kalyan sujeeth
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X