Oh Baby Total Collections: ఓ బేబీ టోటల్ కలెక్షన్స్.. సమంత- నందినీ రెడ్డి మూవీకి ఎన్ని కోట్లంటే?
లాంగ్ గ్యాప్ తర్వాత టాలీవుడ్ అగ్రనటి సమంత తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్నారు. అదే మా ఇంటి బంగారం. నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 19న వరల్డ్ వైడ్‌గా విడుదలైంది. వీరిద్దరి కాంబోలో వస్తున్న మూడో చిత్రం మా ఇంటి బంగారం. గతంలో నందినీ రెడ్డి దర్శకత్వంలో జబర్దస్త్, ఓ బేబీ సినిమాలలో సమంత నటించారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కార్యక్రమాలతో మా ఇంటి బంగారం మూవీపై అంచనాలు నెలకొన్నాయి. ఇదే సమయంలో సమంత గత చిత్రాల కలెక్షన్స్, వాటి రిజల్ట్ గురించి చర్చ జరుగుతోంది. ప్రధానంగా సమంత- నందినీ రెడ్డిల గత చిత్రం ఓ బేబీ టోటల్ కలెక్షన్స్ ఎంత? ఫైనల్‌గా ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టింది చూస్తే..
ఓ బేబీ తారాగణం
కొరియాలో ఘన విజయం సాధించిన మిస్ గ్రానీ సినిమాను బేస్ చేసుకుని ఓ బేబీ సినిమాను తెలుగులో తెరకెక్కించారు నందినీ రెడ్డి. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, గురు ఫిల్మ్స్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్స్‌పై దగ్గుబాటి సురేష్ బాబు, సునీత తాటి, టీజీ విశ్వప్రసాద్‌లు ఓ బేబీని నిర్మించారు. అలనాటి నటి లక్ష్మీ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించగా.. రాజేంద్రప్రసాద్, నాగశౌర్య, రావు రమేశ్, తేజ సజ్జా, ప్రగతి, ఊర్వశి, ఐశ్వర్య తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. నవయువ సామ్రాట్ నాగచైతన్య, జగపతి బాబు, అడివి శేష్, సుమ కనకాల గెస్ట్ రోల్స్‌లో అలరించారు.

ఓ బేబీ ప్రీ రిలీజ్ బిజినెస్
రిచర్డ్ ప్రసాద్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా.. జునైద్ సిద్ధిఖి ఎడిటర్‌గా, మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి ఓ బేబీ మూవీని 20 కోట్ల రూపాయలతో తెరకెక్కించారు. జూలై 5, 2019న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా విడుదలైంది. ఆంధ్రా, తెలంగాణ, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లలో కలిపి ఓ బేబీ మూవీ వరల్డ్ వైడ్‌గా 10 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే 22 కోట్ల రూపాయల గ్రాస్.. 11 కోట్ల రూపాయల షేర్ రాబట్టాల్సి ఉందని బ్రేక్ఈవెన్ వాల్యూ నిర్దేశించారు.
ఓ బేబీ కలెక్షన్స్
సమంత మూవీకి ఇండియాలో తొలిరోజున 2.5 కోట్ల రూపాయలు, రెండో రోజున 2 కోట్ల రూపాయలు, మూడో రోజున 4 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 1.9 కోట్ల రూపాయలు, ఐదో రోజున 1.4 కోట్ల రూపాయలు, ఆరో రోజున 1.5 కోట్ల రూపాయలు, ఏడో రోజున 1.8 కోట్ల రూపాయలు, ఎనిమిదో రోజున 1.1 కోట్ల రూపాయలు, తొమ్మిదో రోజున 1.5 కోట్ల రూపాయలు, పదో రోజున 2 కోట్ల రూపాయలు, పదకొండో రోజున 70 లక్షల రూపాయలు, పన్నెండో రోజున 65 లక్షల రూపాయలు, పదమూడో రోజున 60 లక్షల రూపాయలు, పద్నాలుగో రోజున 55 లక్షల రూపాయలు చొప్పున వసూలు చేసినట్లు సాక్‌నిక్ వెల్లడించింది.
ఓ బేబీ వరల్డ్ వైడ్ కలెక్షన్స్
థియేట్రికల్ రన్ ముగిసేసరికి ఇండియాలో 23.20 కోట్ల రూపాయల నెట్.. 28 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఓవర్సీస్‌లో వన్ మిలియన్ మార్క్ దాటి 10 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది ఓ బేబీ. భారత్‌లో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి సమంత మూవీకి వరల్డ్ వైడ్‌గా 38 కోట్ల రూపాయల నుంచి 40 కోట్ల రూపాయల రేంజ్‌లో వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ పండితులు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో ఓ బేబీ కలెక్షన్స్
తెలుగు రాష్ట్రాల్లో ఓ బేబీ వసూళ్లు పరిశీలిస్తే.. నైజాంలో 5.10 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 1.50 కోట్ల రూపాయలు, వైజాగ్‌లో 1.95 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 80 లక్షల రూపాయలు, వెస్ట్ గోదావరిలో 70 లక్షల రూపాయలు, కృష్ణా జిల్లాలో 1.05 కోట్ల రూపాయలు, గుంటూరులో 85 లక్షల రూపాయలు, నెల్లూరులో 40 లక్షల రూపాయలు చొప్పున ఏపీ+ తెలంగాణలలో 21.5 కోట్ల రూపాయల గ్రాస్.. 12.35 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అమెరికాలో 7.4 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 3.3 కోట్ల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 1.7 కోట్ల రూపాయలు చొప్పున 38 కోట్ల రూపాయలు రాబట్టింది ఓ బేబీ.
ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే డిస్ట్రిబ్యూషన్ పరంగా 22 కోట్ల రూపాయల గ్రాస్... 11 కోట్ల రూపాయల షేర్ రాబట్టాల్సి ఉంది. అయితే ఓ బేబీ మాత్రం దానికి డబుల్ వసూలు చేసి 10 కోట్ల రూపాయలకు పైగా లాభాలను అందించింది. ఓటీటీ రైట్స్, ఆడియో రైట్స్, శాటిలైట్ రైట్స్‌తో కలిపి ఓ బేబీ నిర్మాతకు భారీ లాభాలు వచ్చాయని అప్పట్లో ట్రేడ్ వర్గాలు తెలిపాయి.


Click it and Unblock the Notifications




