సమంత ‘ఓ బేబీ’ దెబ్బకు ఆనంద్ దేవరకొండ, సందీప్ కిషన్ చిత్రాలు విలవిల!

సమంత ప్రధాన పాత్రలో రూపొందిన 'ఓ బేబీ' చిత్రం యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా పుంజుకున్నది. ఫస్ట్ వీకెండ్ తర్వాత వీక్ డేస్‌లో కలెక్షన్ల పరంగా పూర్తిగా నీరసించి పోగా సెకండ్ వీకెండ్‌లో ట్రేడ్ వర్గాలను ఆశ్చర్య పరుస్తూ వసూళ్ల వర్షం కురిపించింది.

తొలి వారం వసూళ్లు పరిశీలిస్తే.... ఈ మూవీ 1 మిలియన్ మార్క్ అందుకోవడం అసాధ్యమని అనుకున్నారు. కానీ సెకండ్ వీకెండ్ వసూళ్లు చూసిన తర్వాత అది సాధ్యమే అనిపిస్తోంది. మంచి ఫ్యామిలీ ఓరియెంటెడ్ సబ్జెక్టుతో పాటు ఫన్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా కావడంతో అమెరికాలోని తెలుగువారు కుటుంబ సమేతంగా చూడటానికి ఇష్టపడుతున్నారు.

 Oh Baby grossed $140k in its second weekend

సెకండ్ వీకెండ్ 'ఓ బేబీ' మూవీ $140k వసూలు చేసింది. దీంతో టోటల్ వసూళ్లు $870k రీచ్ అయింది. త్వరలోనే 1 మిలియన్ మార్క్ అందుకునే అవకాశం ఉంది. గతవారం విడుదలైన 'దొరసాని', 'నిను వీడని నీడను నేనే' చిత్రాల కంటే 'ఓ బేబీ' చూసేందుకే ఎక్కువ ఆసక్తి చూపారు.

ఆనంద్ దేవరకొండ-శివాత్మిక జంటగా నటించిన 'దొరసాని' యూఎస్ఏలోని తెలుగు ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించడంలో విఫలం అయింది. ఫస్ట్ వీకెండ్ కేవలం 10K మాత్రమే వసూలు చేసింది. సందీప్ కిషషన్ 'నిను వీడని నీడను నేనే' 16K రాబట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X