twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాక్సాఫీసును షేక్ చేసిన సమంత... షాకయ్యేలా ‘ఓ బేబీ’ కలెక్షన్స్!

    |

    లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు, హీరోయిన్ సెంట్రిక్ సబ్జెక్టులకు బాక్సాఫీసు వద్ద పెద్దగా ఆదరణ ఉండదు అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. అఫ్ కోర్స్ పలు సందర్భాల్లో ఇది నిజమని తేలింది కూడా. అయితే కొందరు స్టార్ హీరోయిన్లు మాత్రమే ఇలాంటి అభిప్రాయాలను తలక్రిందులు చేశారు.

    తాజాగా విడుదలైన సమంత చిత్రం 'ఓ బేబీ' మహిళా ప్రధాన చిత్రాలకు బాక్సాఫీస్ వద్ద ఆదరణ ఉండదు అనే కామెంట్లను అధిగమించింది. జులై 5న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీసును షేక్ చేసింది. అందరూ ఆశ్చర్య పడేలా వసూళ్లు సాధించింది. సినిమా ప్రమోషన్ కోసం సమంత అండ్ టీమ్ పడ్డ కష్టానికి తగిన ఫలితం దక్కేలా చేసింది.

    ఫస్ట్ వీకెండ్ గ్రాస్ రూ. 17 కోట్లు

    ఫస్ట్ వీకెండ్ గ్రాస్ రూ. 17 కోట్లు

    ‘ఓ బేబీ' ఫస్ట్ వీకెండ్ వరల్డ్ వైడ్ రూ. 17 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. హీరోలకు మాత్రమే సాధ్యమయ్యే ఇలాంటి ఫీట్ సమంత చిత్రం సాధించడం ట్రేడ్ వర్గాలను సర్‌ప్రైజ్ చేసింది. కథలో విషయం ఉంటే సినిమాలో స్టార్ హీరోలు లేక పోయినా ప్రేక్షకుల ఆదరణ పొందవచ్చు అనేది ఈ సినిమా ద్వారా మరోసారి రుజువైంది.

    ఓపెనింగ్ డేతో పోలిస్తే ఆదివారం పెరిగిన వసూళ్లు

    ఓపెనింగ్ డేతో పోలిస్తే ఆదివారం పెరిగిన వసూళ్లు

    దాదాపు నెల రోజుల నుంచి సమంత అండ్ టీమ్ అలుపు లేకుండా ప్రమోషన్స్ నిర్వహించడంతో మంచి హైప్ వచ్చింది. దీంతో తొలిరోజు ఈ మూవీ మంచి ఓపెనింగ్స్ సాధించింది. పాజిటివ్ టాక్ రావడంతో రెండో రోజు వసూళ్లు పుంజుకున్నాయి. అయితే మూడోరోజైన ఆదివారం కలెక్షన్స్ తొలిరోజుతో పోలిస్తే 50శాతం పెరిగాయి.

    ఫస్ట్ వీకెండ్ షేర్ ఏరియా వైజ్

    ఫస్ట్ వీకెండ్ షేర్ ఏరియా వైజ్

    ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఫస్ట్ వీకెండ్ ఏరియా వైజ్ డిస్ట్రిబ్యూటర్ షేర్ నైజాంలో రూ. 2.26 కోట్లు, సీడెడ్ రూ. 40 లక్షలు, ఉత్తరాంద్ర రూ. 69 లక్షలు, గుంటూరు రూ. 33 లక్షలు, ఈస్ట్ గోదావరి రూ. 29 లక్షలు, వెస్ట్ గోదావరి రూ. 24 లక్షలు, కృష్ణ రూ. 42 లక్షలు, నెల్లూరు 12 లక్షలు, రెస్టాఫ్ ఇండియా రూ. 1.05 కోట్లు, ఓవర్సీస్ రూ. 2.10 కోట్లు..... టోటల్ వరల్డ్ వైడ్ రూ. 7.90 కోట్లు రాబట్టింది.

    యూఎస్ఏలో 1 మిలియన్ దిశగా

    యూఎస్ఏలో 1 మిలియన్ దిశగా

    యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద ‘ఓ బేబీ' ఫస్ట్ వీకెండ్ 500K రాట్టింది. ఫుల్ రన్‌లో 1 మిలియన్ మార్క్ అందుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఈ మూవీ కథ ప్రతి ఒక్కరి హృదయాలను టచ్ చేస్తోంది. అయితే వీక్ డేస్‌లో సినిమా పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనే అంశంపై విజయం ఆధారపడి ఉంటుంది.

    ఓ బేబీ

    ఓ బేబీ

    స‌మంత అక్కినేని, ల‌క్ష్మి, నాగ‌శౌర్య‌, రావు ర‌మేష్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్ ప్ర‌ధాన తారాగ‌ణంగా బి.వి.నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, గురు ఫిలింస్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, క్రాస్ పిక్చ‌ర్స్ ప‌తాకాల‌పై తెర‌కెక్కిన చిత్రం ` ఓ బేబీ`. సురేష్ బాబు, సునీత తాటి, టి.జి.విశ్వప్ర‌సాద్‌, హ్యున్ హు, థామ‌స్ కిమ్ నిర్మాత‌లు. ‘మిస్ గ్రానీ' అనే కొరియన్ చిత్రానికి ఇది రీమేక్.

    English summary
    Oh Baby movie first weekend collections Rs. 17 cr gross world wide. Oh! Baby is 2019 Telugu fantasy comedy film, based on the South Korean film Miss Granny, produced by D. Suresh Babu, Sunitha Tati, T.G.Vishwa Prasad, Hyunwoo Thomas Kim on Suresh Productions, People's Media Factory Guru Films, Kross Pictures banners and directed by B. V. Nandini Reddy. The film stars Samantha Akkineni, Naga Shaurya, Lakshmi, Rajendra Prasad in the lead roles and music composed by Mickey J. Meyer.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X