‘ఓ బేబీ’ మూవీ కలెక్షన్స్: ఇక్కడ డౌన్.. అక్కడ సూపర్బ్!
సమంత అక్కినేని, లక్ష్మి, నాగశౌర్య, రావు రమేష్, రాజేంద్రప్రసాద్ ప్రధాన తారాగణంగా బి.వి.నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఓ బేబీ. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, క్రాస్ పిక్చర్స్ పతాకాలపై సురేష్ బాబు, సునీత తాటి, టి.జి.విశ్వప్రసాద్, హ్యున్ హు, థామస్ కిమ్ నిర్మాతలుగా ఈ చిత్రం తెరకెక్కింది.
జులై 5న విడుదలైన ఈచిత్రం బాక్సాఫీసు వద్ద మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఫస్ట్ వీకెండ్ ప్రపంచ వ్యాప్తంగా రూ. 17 కోట్ల గ్రాస్ వసూలు చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. అయితే వీకెండ్ పూర్తయి వీక్ డేస్‌లోకి ఎంటరైన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో 'ఓ బేబీ' బిజినెస్ డౌన్ అయింది.

అయితే ఆశ్చర్యకరంగా 'ఓ బేబీ' బిజినెస్ ఓవర్సీస్ మార్కెట్లో స్టడీగా కొనసాగుతోంది. అమెరికాలోని తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూసేందుకు ఆసక్తి చూపడమే ఇందుకు కారణం. తాజా సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 'ఓ బేబీ' మూవీ $679,567 వసూలు చేసినట్లు తెలుస్తోంది. సెకండ్ వీకెండ్ పూర్తయ్యేలోపే ఈ మూవీ 1 మిలియన్ మార్క్ అందుకుంటుందా? లేదా? అనేది వేచి చూడాలి.
సమంత అక్కినేని, లక్ష్మి, నాగశౌర్య, రావు రమేష్, రాజేంద్రప్రసాద్ ప్రధాన తారాగణంగా బి.వి.నందినీ రెడ్డి దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, క్రాస్ పిక్చర్స్ పతాకాలపై తెరకెక్కిన చిత్రం ఓ బేబీ. సురేష్ బాబు, సునీత తాటి, టి.జి.విశ్వప్రసాద్, హ్యున్ హు, థామస్ కిమ్ నిర్మాతలు. 'మిస్ గ్రానీ' అనే కొరియన్ చిత్రానికి ఇది రీమేక్.


Click it and Unblock the Notifications











