మిలియన్ డాలర్ క్లబ్‌లో సమంత.. దుమ్మురేపుతున్న 'ఓ బేబీ'
సమంత లీడ్ రోల్ పోషించిన ఓ బేబీ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. సక్సెస్ ఫుల్ టాక్‌తో ఇప్పటికే విజయవంతంగా 2 వారాలు పూర్తి చేసుకుని మూడో వారం సైతం డిసెంట్ వసూళ్లతో రన్ అవుతోంది. తొలి రెండు వారాలు బాక్సాఫీసు వద్ద ఆధిపత్యం చూపిన ఈ మూవీ మూడో వారం కాస్త నెమ్మదించిందని సమాచారం.
కాగా యూఎస్ మార్కెట్‌లో మంచి జోష్‌లో ఉన్న ఓ బేబీ సినిమా తాజాగా మిలియన్ డాలర్ క్లబ్ లో చేరింది. నిర్మాతలకు ప్రాఫిటబుల్ వెంచర్ గా నిలిచిన ఈ సినిమా విజయంపై సమంత, చిత్రయూనిట్ అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విడుదలకు ముందు నుంచే ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో సమంత పెట్టిన స్పెషల్ ఇంట్రెస్ట్ సినిమాకు బాగా కలిసొచ్చిందని చెప్పుకోవచ్చు.

నందినీ రెడ్డి దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఓ బేబీ సినిమా రూపొందింది. చిత్రంలో 70 ఏళ్ల యువతిగా, 20 ఏళ్ల పడుచు పిల్లగా రెండు డిఫరెంట్ షేడ్స్‌లో నటించింది అక్కినేని సమంత. నాగశౌర్య, రాజేంద్రప్రసాద్, రావు రమేష్, సీనియర్ నటి శ్రీలక్ష్మి తదితరులు కీలకపాత్రల్లో నటించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను రీచ్ అయి విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. చిత్రంలోని కామెడీ, ఎమోషనల్ సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ మెప్పు పొందాయి.


Click it and Unblock the Notifications











