‘ఒక లైలా కోసం’ ఫస్ట్ డే కలెక్షన్ 5 కోట్లా? నిజమేనా?
హైదరాబాద్: అక్కినేని నాగ చైతన్య హీరోగా ‘గుండెజారి గల్లంతయ్యిందే' ఫేం విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో కింగ్ నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నిర్మించిన ‘ఒక లైలా కోసం' అక్టోబర్ 17న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 5 కోట్లు వసూలు చేసినట్లు ఆ చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది.
‘మనం' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ‘ఒక లైలా కోసం' నాగ చైతన్యకు మరో సూపర్ హిట్ చిత్రం అయిందని, నాగ చైతన్య సోలో హీరోగా నటించిన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ తో 5 కోట్లు కలెక్ట్ చేయడమే కాకుండా నాగ చైతన్య కెరీర్లో నెం.1 చిత్రంగా నిలిచిందని తెలిపారు.

నాగ చైతన్య, పూజా హెడ్గే జంటగా నటించిన ఈ చిత్రంలో అలీ, షాయాజీ షిండే, రోహిణి, సుమన్, సుధ, చలపతిరావు, అన్నపూర్ణ, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్, భరత్ రెడ్డి తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఐ.ఆండ్యూ, సంగీతం: అనూప్ రూబెన్స్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, విజయ్, నిర్మాత: అక్కినేని నాగార్జున, దర్శకత్వం: విజయ్ కుమార్ కొండ.


Click it and Unblock the Notifications











