twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Oke Oka Jeevitham Collections: సండే కలెక్షన్లు డబుల్.. అప్పుడే అన్ని కోట్ల లాభాలు.. మరో రికార్డు

    |

    విలక్షణమైన నటన, విభిన్నమైన చిత్రాలతో తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు టాలెంటెడ్ గాయ్ శర్వానంద్. తొలినాళ్లలో చిన్న చిన్న పాత్రలు చేసిన అతడు.. హీరోగా మారిన తర్వాత వెనుదిరిగి చూడకుండా ముందుకెళ్తోన్నాడు. కెరీర్ ఆరంభంలో ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న శర్వానంద్.. ఇటీవలి కాలంలో పరాజయాల పరంపరతో ఇబ్బందులు ఎదుర్కొంటోన్నాడు.

    ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే అతడు 'ఒకే ఒక జీవితం' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమాకు టాక్‌కు అనుగుణంగానే కలెక్షన్లు కూడా మంచిగానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'ఒకే ఒక జీవితం' 10 రోజుల రిపోర్టును చూద్దాం పదండి!

    ఒకే ఒక జీవితం మూవీలో వాళ్లంతా

    ఒకే ఒక జీవితం మూవీలో వాళ్లంతా

    శర్వానంద్ - శ్రీ కార్తీక్ కాంబోలో రూపొందిన టైం ట్రావెల్ మూవీనే 'ఒకే ఒక జీవితం'. రీతూ వర్మ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో అమల, ప్రియదర్శి, వెన్నెల కిశోర్, నాజర్‌లు కీలక పాత్రలు పోషించారు. దీన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రభు నిర్మించారు. ఇది తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదలైంది. జాక్స్ బిజాయ్ ఈ మూవీకి సంగీతం అందించారు.

    తెలుగు పిల్ల ఎద అందాల జాతర: చీర ఉన్నా పరువాలు దాగట్లేదుగా!తెలుగు పిల్ల ఎద అందాల జాతర: చీర ఉన్నా పరువాలు దాగట్లేదుగా!

    థియేట్రికల్ బిజినెస్ వివరాలివే

    థియేట్రికల్ బిజినెస్ వివరాలివే

    యంగ్ హీరో శర్వానంద్‌కు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా మార్కెట్ లేదు. దీనికితోడు ఈ మధ్య అతడికి హిట్లు కూడా లేవు. దీంతో 'ఒకే ఒక జీవితం' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రూ. 6.50 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లలో కలిపి రూ. 1.00 కోట్లు వ్యాపారం జరిగింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 7.50 కోట్ల బిజినెస్ అయింది.

    10వ రోజు ఎక్కడ ఎంతొచ్చింది?

    10వ రోజు ఎక్కడ ఎంతొచ్చింది?

    10వ రోజు 'ఒకే ఒక జీవితం' మూవీకి వసూళ్లు రెట్టింపు అయ్యాయి. ఫలితంగా నైజాంలో రూ. 17 లక్షలు, సీడెడ్‌లో రూ. 5 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 6 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో కలిపి ఏపీ, తెలంగాణలో రూ. 45 లక్షలు షేర్, రూ. 80 లక్షలు గ్రాస్ వసూలైంది.

    యాంకర్ స్రవంతి అందాల ఆరబోత: శృతి మించిన హాట్ షోతో రచ్చయాంకర్ స్రవంతి అందాల ఆరబోత: శృతి మించిన హాట్ షోతో రచ్చ

    10 రోజులకు కలిపి ఎంతొచ్చింది?

    10 రోజులకు కలిపి ఎంతొచ్చింది?

    శర్వానంద్ 'ఒకే ఒక జీవితం'కు 10 రోజుల్లో వసూళ్లు బాగానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 2.82 కోట్లు, సీడెడ్‌లో రూ. 47 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 67 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 45 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 31 లక్షలు, గుంటూరులో రూ. 44 లక్షలు, కృష్ణాలో రూ. 40 లక్షలు, నెల్లూరులో రూ. 24 లక్షలతో కలిపి రూ. 5.80 కోట్లు షేర్, రూ. 9.70 కోట్లు గ్రాస్ వసూలైంది.

     ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

    ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

    ఏపీ, తెలంగాణలో 10 రోజుల్లో రూ. 5.80 కోట్లు వసూలు చేసిన 'ఒకే ఒక జీవితం' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ పర్వాలేదనిపించింది. ఫలితంగా కర్నాటక, రెస్టాఫ్ ఇండియా రూ. 47 లక్షలు తమిళ వెర్షన్‌కు రూ. 1.10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.85 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో 10 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 9.22 కోట్లు షేర్‌, రూ. 21.45 కోట్లు గ్రాస్ వచ్చింది.

    తడిచిన బట్టల్లో సీరియల్ నటి పరువాల విందు: ఆమెనిలా చూస్తే మెంటలెక్కిపోద్ది!

    టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి

    టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి

    టైం ట్రావెల్ కథతో ఎమోషనల్‌గా రూపొందిన 'ఒకే ఒక జీవితం' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 8 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 10 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 9.22 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా హిట్ స్టేటస్‌తో పాటు రూ. 1.22 కోట్లు లాభాను కూడా ఖాతాలో వేసుకుంది.

    వసూళ్లు డబుల్.. నయా రికార్డు

    వసూళ్లు డబుల్.. నయా రికార్డు

    శర్వానంద్ హీరోగా నటించిన 'ఒకే ఒక జీవితం' మూవీకి పదవ రోజు ఆదివారం కావడంతో స్పందన భారీగా పెరిగింది. దీంతో ఈరోజు వసూళ్లు డబుల్ అయ్యాయి. తెలుగులోనే కాదు.. అన్ని ప్రాంతాల్లోనూ ఇది భారీ వసూళ్లు రాబట్టింది. ఇక, తాజాగా శర్వానంద్ నటించిన ఈ చిత్రం రూ. 1 కోటి లాభాల మార్కును సొంతం చేసుకుని మరో రికార్డును కూడా సొంతం చేసుకుంది.

    English summary
    Young actor Sharwanand Did Oke Oka Jeevitham Movie Under Shree Karthick Direction. This Movie Collects Rs 9.22 Cr in 10 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X