Oke Oka Jeevitham Collections: శర్వానంద్ 'ఒకే ఒక జీవితం' 12వ రోజు వసూళ్లు ఎలా ఉన్నాయంటే?
రన్ రాజా రన్, శతమానం భవతి వంటి తదితర చిత్రాలతో హిట్ కొట్టిన శర్వానంద్ ఇటీవల కాలంలో వరుస పరాజయాలు చవిచూశాడు. ఆడవాళ్లు మీకు జోహార్లు, మహా సముద్రం అనుకున్నంతగా ఆకట్టుకోలేదు. ఇక తాజాగా ఒకే ఒక జీవితం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శర్వానంద్ కు అక్కినేని అమల తల్లిగా నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 9న విడుదల కాగా 12వ రోజు బాక్సాఫీస్ కలెక్షన్లు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దామా!
విభిన్నమైన కథలతో పాటు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు శర్వానంద్. కెరీర్ మొదట్లో చిన్న పాత్రల్లో మెరిసిన శర్వానంద్ హీరోగా మారి ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. తాజాగా యంగ్ హీరో శర్వానంద్, శ్రీ కార్తీక్ కాంబినేషన్లో రూపొందిన టైమ్ ట్రావెల్ చిత్రం ఒక ఒకే జీవితం. ఇందులో రీతూ వర్మ హీరోయిన్ గా నటించగా.. అక్కినేని అమల కీలక పాత్ర పోషించారు.

థియేట్రికల్ బిజినెస్ డీటేల్స్ ఇలా..
యంగ్ హీరో శర్వానంద్‌కు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా మార్కెట్ లేదు. దీనికితోడు ఈ మధ్య అతడికి హిట్లు కూడా లేవు. దీంతో 'ఒకే ఒక జీవితం' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రూ. 6.50 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లలో కలిపి రూ. 1.00 కోట్ల వ్యాపారం జరిగింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 7.50 కోట్ల బిజినెస్ అయింది.

12వ రోజు వచ్చింది ఎంతంటే?
డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ ఆర్ ప్రభు ఈ సినిమాను నిర్మించారు. తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదలైన ఈ చిత్రానికి జాక్స్ బిజోయ్ సంగీతం అందించారు. అయితే శర్వానంద్, రీతూ వర్మ హీరో హీరోయిన్లుగా నటించిన 'ఒకే ఒక జీవితం' సినిమా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో 12వ ఒక్క రోజు కలిపి రూ. 14 లక్షల షేర్, రూ. 25 లక్షల గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది.

12 రోజులకు కలిపి ఎంతొచ్చిందంటే?
శర్వానంద్ 'ఒకే ఒక జీవితం' సినిమాకు 12 రోజుల్లో వసూళ్లు బాగానే వచ్చినట్లు కనిపిస్తోంది. ఫలితంగా నైజాంలో రూ. 2.95 కోట్లు, సీడెడ్‌లో రూ. 52 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 72 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 47 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 33 లక్షలు, గుంటూరులో రూ. 47 లక్షలు, కృష్ణాలో రూ. 43 లక్షలు, నెల్లూరులో రూ. 26 లక్షలతో కలిపి రూ. 6.15 కోట్లు షేర్, రూ. 10.30 కోట్లు గ్రాస్ వసూలైంది.

వరల్డ్ వైడ్ గా వచ్చింది ఎంతంటే?
ఏపీ, తెలంగాణలో 12 రోజుల్లో రూ. 6.15 కోట్లు వసూలు చేసిన 'ఒకే ఒక జీవితం' చిత్రం.. ప్రపంచ వ్యాప్తంగానూ పర్వాలేదనిపించింది. ఫలితంగా కర్నాటక, రెస్టాఫ్ ఇండియా రూ. 51 లక్షలు తమిళ వెర్షన్‌కు రూ. 1.18 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.95 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో 12 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 9.79 కోట్లు షేర్, రూ. 23.00 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలంటే?
టైం ట్రావెల్ కథతో ఎమోషనల్‌గా రూపొందిన 'ఒకే ఒక జీవితం' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 8 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 12 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 9.79 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా హిట్ స్టేటస్‌తో పాటు రూ. 1.79 కోట్ల లాభాన్ని కూడా ఖాతాలో వేసుకుంది.


Click it and Unblock the Notifications











