Oke Oka Jeevitham Collections: భారీగా పడిపోయిన వసూళ్లు.. మన కంటే అక్కడే ఎక్కవగా!

ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మంది యంగ్ హీరోలు తమదైన నటనతో ప్రేక్షకులను ఫిదా చేస్తున్నారు. తద్వారా మంచి పేరుతో పాటు ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను కూడా బాగా పెంచుకుంటోన్నారు. అలాంటి వారిలో విలక్షణ నటుడు శర్వానంద్ ఒకడు. కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న పాత్రలు చేసిన అతడు.. హీరోగా మారిన తర్వాత విశేషమైన గుర్తింపును దక్కించుకుని వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే శర్వానంద్ 'ఒకే ఒక జీవితం' మూవీ చేశాడు. ఈ సినిమా 15 రోజుల బాక్సాఫీస్ రిపోర్టును చూద్దాం పదండి!

ఒకే ఒక జీవితం మూవీలో ఎవరు?

ఒకే ఒక జీవితం మూవీలో ఎవరు?

శర్వానంద్ హీరోగా శ్రీ కార్తీక్ దర్శకత్వంలో రూపొందిన సినిమానే 'ఒకే ఒక జీవితం'. రీతూ వర్మ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో అమల, ప్రియదర్శి, వెన్నెల కిశోర్, నాజర్‌లు కీలక పాత్రలు పోషించారు. దీన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రభు నిర్మించారు. జాక్స్ బిజాయ్ ఈ మూవీకి సంగీతం అందించారు. ఇది తెలుగు, తమిళంలో నేరుగా విడుదలైంది.

థియేట్రికల్ బిజినెస్ వివరాలివే

థియేట్రికల్ బిజినెస్ వివరాలివే


ఆంధ్రా, తెలంగాణలో యంగ్ హీరో శర్వానంద్‌కు పెద్దగా మార్కెట్ లేదు. దీనికితోడు ఈ మధ్య అతడికి హిట్లు కూడా లేవు. దీంతో 'ఒకే ఒక జీవితం' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రూ. 6.50 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లలో కలిపి రూ. 1.00 కోట్లు వ్యాపారం జరిగింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 7.50 కోట్ల బిజినెస్ జరిగింది.

15వ రోజు ఎక్కడ ఎంతొచ్చింది?

15వ రోజు ఎక్కడ ఎంతొచ్చింది?


శ్రీ కార్తీక్ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా నటించిన 'ఒకే ఒక జీవితం' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో మంచి టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే కలెక్షన్లు కూడా మంచిగానే వచ్చాయి. దీంతో రెండో వారంలోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను కూడా చేరుకుంది. అయితే, ఇప్పుడు క్రమంగా దీనికి వసూళ్లు పడిపోతోన్నాయి. ఈ నేపథ్యంలో 15వ రోజు దీనికి కేవలం రూ. 5 లక్షలే వచ్చాయి.

15 రోజులకు కలిపి ఎంతొచ్చింది?

15 రోజులకు కలిపి ఎంతొచ్చింది?


క్రేజీ సబ్జెక్టుతో వచ్చిన 'ఒకే ఒక జీవితం'కు 15 రోజుల్లో వసూళ్లు బాగా వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 3.06 కోట్లు, సీడెడ్‌లో రూ. 55 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 76 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 48 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 34 లక్షలు, గుంటూరులో రూ. 48 లక్షలు, కృష్ణాలో రూ. 45 లక్షలు, నెల్లూరులో రూ. 26 లక్షలతో కలిపి రూ. 6.38 కోట్లు షేర్, రూ. 10.75 కోట్లు గ్రాస్ వసూలైంది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది


ఆంధ్రా, తెలంగాణలో 15 రోజుల్లో రూ. 6.38 కోట్లు వసూలు చేసిన 'ఒకే ఒక జీవితం'.. ప్రపంచ వ్యాప్తంగానూ పర్వాలేదనిపించింది. ఫలితంగా కర్నాటక, రెస్టాఫ్ ఇండియా రూ. 57 లక్షలు తమిళ వెర్షన్‌కు రూ. 1.29 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.05 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో 15 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 10.29 కోట్లు షేర్‌, రూ. 24.40 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఎంత? లాభాలు ఎంత?

టార్గెట్ ఎంత? లాభాలు ఎంత?


ఎమోషనల్ కంటెంట్‌తో వచ్చిన 'ఒకే ఒక జీవితం' మూవీకి అంచనాలు లేకపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 8 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 15 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 10.29 కోట్లు వసూలు చేసింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 2.29 కోట్లు లాభాలు వచ్చాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X