Oke Oka Jeevitham Collections: శర్వానంద్ మరో రికార్డు.. అన్ని కోట్ల లాభాలతో హవా

తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన శైలి నటనతో ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని వరుస సినిమాలతో అలరిస్తున్నాడు టాలెంటెడ్ గాయ్ శర్వానంద్. కెరీర్ ఆరంభం నుంచీ విలక్షణమైన నటన, విభిన్నమైన చిత్రాలతో మెప్పిస్తోన్న అతడు.. కొంత కాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే శర్వానంద్ 'ఒకే ఒక జీవితం' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆరంభం నుంచే మంచి కలెక్షన్లతో ఇది హిట్ అయిపోయింది. ఈ నేపథ్యంలో 'ఒకే ఒక జీవితం' మూవీ 17 రోజుల బాక్సాఫీస్ రిపోర్టును చూద్దాం పదండి!

ట్రైం ట్రావెలర్‌గా ఒకే ఒక జీవితం

ట్రైం ట్రావెలర్‌గా ఒకే ఒక జీవితం

శర్వానంద్ హీరోగా శ్రీ కార్తీక్ రూపొందించిన సినిమానే 'ఒకే ఒక జీవితం'. రీతూ వర్మ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో అమల, ప్రియదర్శి, వెన్నెల కిశోర్, నాజర్‌లు కీలక పాత్రలు పోషించారు. దీన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రభు నిర్మించారు. జాక్స్ బిజాయ్ ఈ మూవీకి సంగీతం అందించారు. ఇది తెలుగు, తమిళంలో ఏకకాలంలో విడుదలైంది.

థియేట్రికల్ బిజినెస్ వివరాలివే

థియేట్రికల్ బిజినెస్ వివరాలివే


యంగ్ హీరో శర్వానంద్‌కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పెద్దగా మార్కెట్ లేదు. అలాగే ఈ మధ్య అతడికి హిట్లు కూడా లేవు. దీంతో 'ఒకే ఒక జీవితం' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రూ. 6.50 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లలో కలిపి రూ. 1.00 కోట్లు వ్యాపారం జరిగింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 7.50 కోట్ల బిజినెస్ జరిగింది.

17వ రోజు ఎక్కడ ఎంతొచ్చింది?

17వ రోజు ఎక్కడ ఎంతొచ్చింది?

ఏలాగైనా విజయాన్ని అందుకోవల్ల లక్ష్యంతో శర్వానంద్ నటించిన తాజా చిత్రమే 'ఒకే ఒక జీవితం'. ఈ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో మంచి టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే కలెక్షన్లు కూడా మంచిగానే వచ్చాయి. దీంతో రెండో వారంలోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను కూడా చేరుకుంది. ఇక, 17వ రోజు ఈ సినిమాకు రెండు రాష్ట్రాల్లో కలిపి కేవలం రూ. 11 లక్షలు కలెక్ట్ అయ్యాయి.

17 రోజులకు కలిపి ఎంతొచ్చింది?

17 రోజులకు కలిపి ఎంతొచ్చింది?


టైం ట్రావెల్ కథతో వచ్చిన 'ఒకే ఒక జీవితం'కు 17 రోజుల్లో వసూళ్లు బాగా వచ్చాయి. నైజాంలో రూ. 3.15 కోట్లు, సీడెడ్‌లో రూ. 57 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 78 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 49 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 36 లక్షలు, గుంటూరులో రూ. 49 లక్షలు, కృష్ణాలో రూ. 47 లక్షలు, నెల్లూరులో రూ. 27 లక్షలతో కలిపి రూ. 6.58 కోట్లు షేర్, రూ. 11.15 కోట్లు గ్రాస్ వసూలైంది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది


ఏపీ, తెలంగాణలో 17 రోజుల్లో రూ. 6.58 కోట్లు వసూలు చేసిన 'ఒకే ఒక జీవితం'.. ప్రపంచ వ్యాప్తంగానూ పర్వాలేదనిపించింది. ఫలితంగా కర్నాటక, రెస్టాఫ్ ఇండియా రూ. 61 లక్షలు తమిళ వెర్షన్‌కు రూ. 1.33 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.09 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో 17 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 10.62 కోట్లు షేర్‌, రూ. 25.10 కోట్లు గ్రాస్‌తో రికార్డు కొట్టింది.

టార్గెట్ ఎంత? లాభాలు ఎంత?

టార్గెట్ ఎంత? లాభాలు ఎంత?


ఎమోషనల్ కంటెంట్‌తో వచ్చిన 'ఒకే ఒక జీవితం' మూవీకి అంచనాలు లేకపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 8 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 17 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 10.62 కోట్లు వసూలు చేసింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 2.62 కోట్లు లాభాలు వచ్చాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X