Oke Oka Jeevitham Collections: 8 కోట్ల టార్గెట్.. వారంలోనే అన్ని కోట్లు.. హిట్ అవ్వాలంటే మాత్రం!
నేచురల్ యాక్టింగ్‌తో ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరోలు టాలీవుడ్‌లో చాలా తక్కువ మందే ఉన్నారు. అలాంటి వారిలో యంగ్ హీరో శర్వానంద్ ఒకడు. కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న పాత్రలు చేసిన అతడు.. హీరోగా మారిన తర్వాత తనదైన యాక్టింగ్‌తో అలరించాడు. అదే సమయంలో కొన్ని విజయాలను కూడా సొంతం చేసుకుని మార్కెట్‌ను పెంచుకున్నాడు. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం శర్వానంద్ హిట్లు లేక సతమతం అవుతోన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే అతడు 'ఒకే ఒక జీవితం' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమాకు కలెక్షన్లు కూడా మంచిగానే దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో 'ఒకే ఒక జీవితం' మూవీ వారం రోజుల బాక్సాఫీస్ రిపోర్టుపై మీరే లుక్కేయండి!

ఒకే ఒక జీవితం మూవీ వివరాలు
శర్వానంద్ హీరోగా శ్రీ కార్తీక్ దర్శకత్వంలో వచ్చిన టైం ట్రావెల్ మూవీనే 'ఒకే ఒక జీవితం'. రీతూ వర్మ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో అమల, ప్రియదర్శి, వెన్నెల కిశోర్, నాజర్‌లు కీలక పాత్రలు పోషించారు. దీన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రభు నిర్మించారు. జాక్స్ బిజాయ్ ఈ మూవీకి సంగీతం అందించారు. ఇది తెలుగు, తమిళంలో విడుదల అయింది.

థియేట్రికల్ బిజినెస్ వివరాలివే
శర్వానంద్‌కు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా మార్కెట్ లేదు. దీనికితోడు ఈ మధ్య అతడికి హిట్లు కూడా లేవు. దీంతో 'ఒకే ఒక జీవితం' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రూ. 6.50 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లలో కలిపి రూ. 1.00 కోట్లు వ్యాపారం జరిగింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 7.50 కోట్ల బిజినెస్ జరిగింది.

7వ రోజు ఎక్కడ ఎంతొచ్చింది?
7 రోజు 'ఒకే ఒక జీవితం' మూవీకి వసూళ్లు కాస్త తగ్గిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 10 లక్షలు, సీడెడ్‌లో రూ. 2 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 4 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో కలిపి ఏపీ, తెలంగాణలో రూ. 24 లక్షలు షేర్, రూ. 40 లక్షలు గ్రాస్ వసూలైంది.

వారం రోజుల్లో ఎంత వచ్చింది?
శర్వానంద్ 'ఒకే ఒక జీవితం'కు వారం రోజుల్లో వసూళ్లు బాగానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 2.48 కోట్లు, సీడెడ్‌లో రూ. 39 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 55 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 37 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 25 లక్షలు, గుంటూరులో రూ. 35 లక్షలు, కృష్ణాలో రూ. 32 లక్షలు, నెల్లూరులో రూ. 20 లక్షలతో కలిపి రూ. 4.91 కోట్లు షేర్, రూ. 8.20 కోట్లు గ్రాస్ వసూలైంది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది
ఏపీ, తెలంగాణలో వారం రోజుల్లో రూ. 4.91 కోట్లు వసూలు చేసిన 'ఒకే ఒక జీవితం' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ పర్వాలేదనిపించింది. ఫలితంగా కర్నాటక, రెస్టాఫ్ ఇండియా రూ. 40 లక్షలు తమిళ వెర్షన్‌కు రూ. 90 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.43 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో 7 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.64 కోట్లు షేర్, రూ. 17.50 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి
క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'ఒకే ఒక జీవితం' మూవీకి అంచనాలు లేకపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 8 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.64 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 36 లక్షలు వస్తేనే ఇది హిట్ చిత్రంగా నిలుస్తుంది.

టార్గెట్‌కు చేరువ అయిన మూవీ
శర్వానంద్ - రీతూ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన 'ఒకే ఒక జీవితం' మూవీకి టాక్‌తో పాటు రివ్యూలు కూడా పాజిటివ్‌గా వచ్చాయి. అయితే, తెలుగు ప్రేక్షకుల నుంచి దీనికి స్పందన అనుకున్నట్లు రాలేదు. కానీ, ఓవర్సీస్, తమిళ్‌లో మాత్రం వసూళ్లు పెరుగుతున్నాయి. దీంతో ఈ చిత్రం మొదటి వారంలో విజయానికి చేరువైంది. ఈ వీకెండ్‌లో లాభాల బాట పట్టే ఛాన్స్ ఉంది.


Click it and Unblock the Notifications











