twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Oke Oka Jeevitham Collections: 2వ రోజు భారీ వసూళ్లు.. టోటల్‌గా అన్ని కోట్లు.. ఇంకెంత రావాలంటే!

    |

    క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత సోలో హీరోగా మారి.. చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు టాలెంటెడ్ హీరో శర్వానంద్. కెరీర్ ఆరంభంలోనే విలక్షణమైన నటన, విభిన్నమైన చిత్రాలు చేసిన అతడు.. మంచి పేరును సంపాదించుకున్నాడు. దీనికితోడు పలు విజయాలను కూడా ఖాతాలో వేసుకున్నాడు.

    అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం శర్వానంద్ సరైన ఫలితాలను రాబట్టలేకపోయాడు. ఈ పరిస్థితుల్లోనే అతడు తాజాగా 'ఒకే ఒక జీవితం' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో 'ఒకే ఒక జీవితం' మూవీ రెండు రోజుల బాక్సాఫీస్ రిపోర్టును మీరే చూడండి!

     ఒకే ఒక జీవితం అంటూ వచ్చాడు

    ఒకే ఒక జీవితం అంటూ వచ్చాడు

    శర్వానంద్ హీరోగా శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించిన చిత్రమే 'ఒకే ఒక జీవితం'. రీతూ వర్మ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో అమల, ప్రియదర్శి, వెన్నెల కిశోర్, నాజర్‌లు కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రభు నిర్మించారు. జాక్స్ బిజాయ్ ఈ మూవీకి సంగీతం అందించారు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయింది.

    Krishnam Raju Net Worth: కృష్ణంరాజుకు అన్ని కోట్ల ఆస్తులు.. అప్పట్లోనే అంత రెమ్యూనరేషన్‌తో రికార్డుKrishnam Raju Net Worth: కృష్ణంరాజుకు అన్ని కోట్ల ఆస్తులు.. అప్పట్లోనే అంత రెమ్యూనరేషన్‌తో రికార్డు

    థియేట్రికల్ బిజినెస్ వివరాలివే

    థియేట్రికల్ బిజినెస్ వివరాలివే

    శర్వానంద్‌కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పెద్దగా మార్కెట్ లేదు. దీనికితోడు ఈ మధ్య హిట్లు కూడా లేవు. దీంతో 'ఒకే ఒక జీవితం' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రూ. 6.50 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లలో కలిపి రూ. 1.00 కోట్లు వ్యాపారం జరిగింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 7.50 కోట్ల బిజినెస్ జరిగింది.

    రెండో రోజు ఎక్కడ ఎంతొచ్చింది

    రెండో రోజు ఎక్కడ ఎంతొచ్చింది

    'ఒకే ఒక జీవితం' మూవీకి రెండో రోజు వసూళ్లు భారీగా పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 57 లక్షలు, సీడెడ్‌లో రూ. 8 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 11 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 8 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, గుంటూరులో రూ. 8 లక్షలు, కృష్ణాలో రూ. 7 లక్షలు, నెల్లూరులో రూ. 5 లక్షలతో.. ఏపీ, తెలంగాణలో రూ. 1.10 కోట్లు షేర్, రూ. 1.85 కోట్లు గ్రాస్ వసూలైంది.

    <strong>Krishnam Raju: కృష్ణంరాజు రెండు కోరికలు తీర్చని ప్రభాస్.. ఆ పదవి విషయంలోనూ నిరాశే!</strong>Krishnam Raju: కృష్ణంరాజు రెండు కోరికలు తీర్చని ప్రభాస్.. ఆ పదవి విషయంలోనూ నిరాశే!

     2 రోజులకు కలిపి ఎంతొచ్చింది?

    2 రోజులకు కలిపి ఎంతొచ్చింది?

    శర్వానంద్ 'ఒకే ఒక జీవితం' మూవీకి రెండు రోజుల్లో వసూళ్లు బాగానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 97 లక్షలు, సీడెడ్‌లో రూ. 14 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 18 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 13 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 10 లక్షలు, గుంటూరులో రూ. 14 లక్షలు, కృష్ణాలో రూ. 11 లక్షలు, నెల్లూరులో రూ. 8 లక్షలతో కలిపి రూ. 1.85 కోట్లు షేర్, రూ. 3.15 కోట్లు గ్రాస్ వసూలైంది.

    ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

    ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

    ఏపీ, తెలంగాణలో తొలిరోజు రూ. 1.85 కోట్లు వసూలు చేసిన 'ఒకే ఒక జీవితం' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ పర్వాలేదనిపించింది. ఫలితంగా కర్నాటక, రెస్టాఫ్ ఇండియా, తమిళ వెర్షన్లు కలిపి రూ. 25 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 65 లక్షలు మాత్రమే కలెక్ట్ చేసింది. దీంతో రెండు రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.75 కోట్లు షేర్‌, రూ. 5.25 కోట్లు గ్రాస్ వచ్చింది.

    <strong>స్విమ్మింగ్ పూల్‌లో బిగ్ బాస్ భామ రచ్చ: తడిచిన బట్టల్లో అందాల ప్రదర్శన</strong><br />స్విమ్మింగ్ పూల్‌లో బిగ్ బాస్ భామ రచ్చ: తడిచిన బట్టల్లో అందాల ప్రదర్శన

    టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి

    టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి

    శర్వానంద్ హీరోగా రూపొందిన 'ఒకే ఒక జీవితం' మూవీకి అంచనాలు లేకపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 8 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా కేవలం రూ. 2.75 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 5.25 కోట్లు వస్తేనే ఇది హిట్ చిత్రంగా నిలుస్తుంది.

    పెరిగిన వసూళ్లు.. హవా చూపాలి

    పెరిగిన వసూళ్లు.. హవా చూపాలి

    ఎమోషనల్‌ కంటెంట్‌తో టైం ట్రావెల్ నేపథ్యంతో రూపొందిన 'ఒకే ఒక జీవితం' మూవీకి టాక్‌తో పాటు రివ్యూలు కూడా పాజిటివ్‌గానే వచ్చాయి. కానీ, ప్రేక్షకుల నుంచి స్పందన మాత్రం అనుకున్న రేంజ్‌లో రాలేదు. కానీ, రెండో రోజు వసూళ్లు కాస్త పెరిగాయి. అయితే, ఈ సినిమా హిట్ అవ్వాలంటే మరింతగా ప్రభావాన్ని చూపించాల్సిన అవసరం ఉందని కొందరు చెప్తున్నారు.

    English summary
    Young actor Sharwanand Did Oke Oka Jeevitham Movie Under Shree Karthick Direction. This Movie Collects Rs 2.75 Cr in 2 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X