For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Oke Oka Jeevitham Collections: భారీగా పెరిగిన వసూళ్లు.. ఏకంగా అన్ని కోట్లు.. హిట్ అవ్వాలంటే మాత్రం!

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న హీరోలు చాలా మందే ఉన్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన పేర్లలో శర్వానంద్ ఒకటి. చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చిన అతడు.. హీరోగా మారిన తర్వాత మంచి పేరును సంపాదించుకున్నాడు. అలాగే, పలు విజయాలను కూడా ఖాతాలో వేసుకున్నాడు. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం శర్వానంద్ వరుసగా పరాజయాలను చవి చూస్తూ ఇబ్బందులు పడుతున్నాడు.

    ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా అతడు 'ఒకే ఒక జీవితం' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమాకు ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్లు కూడా బాగానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'ఒకే ఒక జీవితం' మూవీ 3 రోజుల బాక్సాఫీస్ రిపోర్టుపై లుక్కేయండి!

    ఒకే ఒక జీవితం అంటూ వచ్చాడు

    ఒకే ఒక జీవితం అంటూ వచ్చాడు

    శర్వానంద్ - శ్రీ కార్తీక్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమే 'ఒకే ఒక జీవితం'. రీతూ వర్మ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో అమల, ప్రియదర్శి, వెన్నెల కిశోర్, నాజర్‌లు కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రభు నిర్మించారు. జాక్స్ బిజాయ్ ఈ మూవీకి సంగీతం అందించారు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలైంది.

    యాంకర్ శ్రీముఖి ఎద అందాల ఆరబోత: టాప్ విప్పేసి మరీ హద్దు దాటేసిందిగా!

    థియేట్రికల్ బిజినెస్ వివరాలివే

    థియేట్రికల్ బిజినెస్ వివరాలివే

    ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో శర్వానంద్‌కు పెద్దగా మార్కెట్ లేదు. దీనికితోడు ఈ మధ్య హిట్లు కూడా లేవు. దీంతో 'ఒకే ఒక జీవితం' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రూ. 6.50 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లలో కలిపి రూ. 1.00 కోట్లు వ్యాపారం జరిగింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 7.50 కోట్ల బిజినెస్ అయింది.

     3వ రోజు ఎక్కడ ఎంతొచ్చింది?

    3వ రోజు ఎక్కడ ఎంతొచ్చింది?

    'ఒకే ఒక జీవితం' మూవీకి మూడో రోజూ వసూళ్లు భారీగా పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 68 లక్షలు, సీడెడ్‌లో రూ. 10 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 15 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 10 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 8 లక్షలు, గుంటూరులో రూ. 10 లక్షలు, కృష్ణాలో రూ. 10 లక్షలు, నెల్లూరులో రూ. 6 లక్షలతో.. ఏపీ, తెలంగాణలో రూ. 1.37 కోట్లు షేర్, రూ. 2.15 కోట్లు గ్రాస్ వసూలైంది.

    హాట్ షోతో షాకిచ్చిన రమ్యకృష్ణ: వామ్మో ఈ వయసులో కూడా ఇలాంటి ఫొటోలా!

    3 రోజులకు కలిపి ఎంతొచ్చింది?

    3 రోజులకు కలిపి ఎంతొచ్చింది?

    శర్వానంద్ నటించిన 'ఒకే ఒక జీవితం'కు 3 రోజుల్లో వసూళ్లు బాగానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 1.65 కోట్లు, సీడెడ్‌లో రూ. 24 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 33 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 23 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 18 లక్షలు, గుంటూరులో రూ. 24 లక్షలు, కృష్ణాలో రూ. 21 లక్షలు, నెల్లూరులో రూ. 14 లక్షలతో కలిపి రూ. 3.22 కోట్లు షేర్, రూ. 5.30 కోట్లు గ్రాస్ వసూలైంది.

    ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

    ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

    ఏపీ, తెలంగాణలో 3 రోజుల్లో రూ. 3.22 కోట్లు వసూలు చేసిన 'ఒకే ఒక జీవితం' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ పర్వాలేదనిపించింది. ఫలితంగా కర్నాటక, రెస్టాఫ్ ఇండియా, తమిళ వెర్షన్లు కలిపి రూ. 40 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.10 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో మూడు రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.72 కోట్లు షేర్‌, రూ. 9.10 కోట్లు గ్రాస్ వచ్చింది.

    బాత్రూంలో ప్రణిత హాట్ సెల్ఫీ: తల్లైన కొద్ది రోజులకే జాకెట్ విప్పేసి మరీ!

    టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి

    టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి

    టైం ట్రావెల్ కథతో వచ్చిన 'ఒకే ఒక జీవితం' మూవీకి అంచనాలు లేకపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 8 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 3 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.72 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 3.28 కోట్లు వస్తేనే ఇది హిట్ చిత్రంగా నిలుస్తుంది.

     వీకెండ్ పర్లేదు.. అసలైన పరీక్ష

    వీకెండ్ పర్లేదు.. అసలైన పరీక్ష

    శర్వానంద్ హీరోగా టైం ట్రావెల్ నేపథ్యంతో రూపొందిన 'ఒకే ఒక జీవితం' మూవీకి టాక్‌తో పాటు రివ్యూలు కూడా పాజిటివ్‌గానే వచ్చాయి. కానీ, ప్రేక్షకుల నుంచి స్పందన మాత్రం అనుకున్న రేంజ్‌లో రాలేదు. మొత్తానికి వీకెండ్‌లో మాత్రం మంచి వసూళ్లే దక్కాయి. అయితే, సోమవారం నుంచి ఈ చిత్రానికి అసలైన పరీక్ష ఉండబోతుంది. మరి ఇది ఎలా నెగ్గుకొస్తుందో చూడాలి.

    English summary
    Young actor Sharwanand Did Oke Oka Jeevitham Movie Under Shree Karthick Direction. This Movie Collects Rs 4.72 Cr in 3 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X