Oke Oka Jeevitham 4 Days Collections: హిట్ టాక్ వచ్చినా కలెక్షన్స్ డౌన్.. బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?

శర్వానంద్ హీరోగా రీతూ వర్మ హీరోయిన్‌గా శ్రీ కార్తీక్ దర్శకత్వంలో 'ఒకే ఒక జీవితం' సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాగే ఈ సినిమాలో అమల, ప్రియదర్శి, వెన్నెల కిశోర్, నాజర్‌లు కీలక పాత్రలలో నటించారు. ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రభు నిర్మించారు. ఇక జాక్స్ బిజాయ్ సినిమాకు సంగీతం అందించారు. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలైంది. ఇక ఈ సినిమా వీకెండ్ అనంతరం 4వ రోజు బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేసింది. ప్రాఫిట్ లోకి రావాలి అంటే ఇంకెంత రావాలి అనే వివరాల్లోకి వెళితే..

ప్రీ రిలీజ్ బిజినెస్.. టార్గెట్

ప్రీ రిలీజ్ బిజినెస్.. టార్గెట్

శర్వానంద్ నటించిన గత 6 సినిమాలు బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నష్టాలను కలుగ జేశాయి. ఇక ఒకే ఒక్క జీవితం సినిమాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అంతగా డిమాండ్ ఏమి ఏర్పడలేదు. 'ఒకే ఒక జీవితం' సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 6.50 కోట్లు బిజినెస్ చేసింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లలో కలిపి రూ. 1.00 కోట్లు వ్యాపారం జరిగింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 7.50 కోట్ల బిజినెస్ చేసినట్లు సమాచారం.

4వ రోజు ఎంత వచ్చాయంటే?

4వ రోజు ఎంత వచ్చాయంటే?

'ఒకే ఒక జీవితం' సినిమాకు 4వ రోజూ వసూళ్లు ఒక్కసారిగా తగ్గిపోయాయి. ఏరియాల వారిగా చూసుకుంటే.. నైజాంలో రూ. 31 లక్షలు, సీడెడ్‌లో రూ. 6 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 7 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో.. ఏపీ, తెలంగాణలో సోమవారం రూ. 0.62 కోట్లు షేర్, రూ. 1.00 కోట్లు గ్రాస్ వచ్చింది.

 4 రోజుల్లో ఏపీ తెలంగాణ కలెక్షన్స్

4 రోజుల్లో ఏపీ తెలంగాణ కలెక్షన్స్

'ఒకే ఒక జీవితం' సినిమా వీకెండ్ వరకు వసూళ్లు బాగానే వచ్చాయి. కానీ సోమవారం మాత్రం సగానికి తగ్గాయి. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో రూ. 1.96 కోట్లు, సీడెడ్‌లో రూ. 30 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 40 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 28 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 21 లక్షలు, గుంటూరులో రూ. 28 లక్షలు, కృష్ణాలో రూ. 25 లక్షలు, నెల్లూరులో రూ. 16 లక్షలతో కలిపి రూ. 3.84 కోట్లు షేర్, రూ. 6.30 కోట్లు గ్రాస్ వసూలైంది.

వరల్డ్ వైడ్ కలెక్షన్స్

వరల్డ్ వైడ్ కలెక్షన్స్

ఏపీ, తెలంగాణలో 4 రోజుల్లో రూ. 3.84 కోట్లు షేర్ వసూలు చేసిన 'ఒకే ఒక జీవితం' సినిమా.. కర్నాటక, రెస్టాఫ్ ఇండియా, తమిళ వెర్షన్లలో మొత్తంగా 4 రోజుల్లో కలిపి రూ. 47 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.20 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక 4 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.51 కోట్లు షేర్‌, రూ. 10.50 కోట్లు గ్రాస్ వచ్చింది.

ఇంకా ఎంత రావాలంటే..

ఇంకా ఎంత రావాలంటే..

మౌత్ టాక్ ద్వారా 'ఒకే ఒక జీవితం' సినిమా వీకెండ్ లో కలెక్షన్స్ బాగానే పెంచుకుంది. ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. 8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో మార్కెట్ లోకి వచ్చింది. ఫైనల్ గా ఈ సినిమా 4 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.51 కోట్లు వసూలు చేసింది. ఇక ప్రాఫిట్ లోకి రావాలి అంటే మరో రూ. 2.49 కోట్లు షేర్ వస్తేనే హిట్ అయినట్లు లెక్క.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X