twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Oke Oka Jeevitham Collections: భారీగా పడిపోయిన వసూళ్లు.. అన్ని కోట్లు వస్తేనే మూవీ హిట్

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న హీరోలు చాలా మందే ఉన్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన పేర్లలో శర్వానంద్ ఒకటి. చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చిన అతడు.. హీరోగా మారిన తర్వాత మంచి పేరును సంపాదించుకున్నాడు. అలాగే, పలు విజయాలను కూడా ఖాతాలో వేసుకున్నాడు. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం శర్వానంద్ వరుసగా పరాజయాలను చవి చూస్తూ ఇబ్బందులు పడుతున్నాడు.

    ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా అతడు 'ఒకే ఒక జీవితం' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమాకు ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్లు కూడా బాగానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'ఒకే ఒక జీవితం' మూవీ 3 రోజుల బాక్సాఫీస్ రిపోర్టుపై లుక్కేయండి!

    ఒకే ఒక జీవితం మూవీ నేపథ్యం

    ఒకే ఒక జీవితం మూవీ నేపథ్యం

    శర్వానంద్ హీరోగా శ్రీ కార్తీక్ దర్శకత్వంలో వచ్చిన చిత్రమే ‘ఒకే ఒక జీవితం'. రీతూ వర్మ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో అమల, ప్రియదర్శి, వెన్నెల కిశోర్, నాజర్‌లు కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రభు నిర్మించారు. జాక్స్ బిజాయ్ ఈ మూవీకి సంగీతం అందించారు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయింది.

    బిందు మాధవి ఎద అందాల అరాచకం: పైన ఏమీ లేకపోవడంతో!బిందు మాధవి ఎద అందాల అరాచకం: పైన ఏమీ లేకపోవడంతో!

    థియేట్రికల్ బిజినెస్ వివరాలివే

    థియేట్రికల్ బిజినెస్ వివరాలివే

    శర్వానంద్‌కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పెద్దగా మార్కెట్ లేదు. దీనికితోడు ఈ మధ్య హిట్లు కూడా లేవు. దీంతో ‘ఒకే ఒక జీవితం' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రూ. 6.50 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లలో కలిపి రూ. 1.00 కోట్లు వ్యాపారం జరిగింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 7.50 కోట్ల బిజినెస్ జరిగింది.

    5వ రోజు ఎక్కడ ఎంతొచ్చింది?

    5వ రోజు ఎక్కడ ఎంతొచ్చింది?

    ‘ఒకే ఒక జీవితం' మూవీకి 5 రోజు వసూళ్లు భారీగా పడిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 24 లక్షలు, సీడెడ్‌లో రూ. 4 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 6 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో.. ఏపీ, తెలంగాణలో రూ. 48 లక్షలు షేర్, రూ. 80 లక్షలు గ్రాస్ వసూలైంది.

    బట్టలు విప్పేసి బాలయ్య హీరోయిన్ దారుణం: ఇలా హద్దు దాటేసిందేంటి!బట్టలు విప్పేసి బాలయ్య హీరోయిన్ దారుణం: ఇలా హద్దు దాటేసిందేంటి!

    5 రోజులకు కలిపి ఎంతొచ్చింది?

    5 రోజులకు కలిపి ఎంతొచ్చింది?

    శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం'కు 5 రోజుల్లో వసూళ్లు తక్కువగా వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 2.20 కోట్లు, సీడెడ్‌లో రూ. 34 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 46 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 32 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 23 లక్షలు, గుంటూరులో రూ. 31 లక్షలు, కృష్ణాలో రూ. 28 లక్షలు, నెల్లూరులో రూ. 18 లక్షలతో కలిపి రూ. 4.36 కోట్లు షేర్, రూ. 7.20 కోట్లు గ్రాస్ వసూలైంది.

    ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

    ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

    5 రోజుల్లో ఏపీ, తెలంగాణలో రూ. 4.36 కోట్లు వసూలు చేసిన ‘ఒకే ఒక జీవితం' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ పర్వాలేదనిపించింది. ఫలితంగా కర్నాటక, రెస్టాఫ్ ఇండియా రూ. 35 లక్షలు తమిళ వెర్షన్‌కు రూ. 80 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.30 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో 5 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 6.83 కోట్లు షేర్‌, రూ. 15.40 కోట్లు గ్రాస్ వచ్చింది.

    హాట్ షోతో షాకిచ్చిన రమ్యకృష్ణ: వామ్మో ఈ వయసులో కూడా ఇలాంటి ఫొటోలా!హాట్ షోతో షాకిచ్చిన రమ్యకృష్ణ: వామ్మో ఈ వయసులో కూడా ఇలాంటి ఫొటోలా!

    టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి

    టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి

    శర్వానంద్ హీరోగా క్రేజీ కాన్సెప్టుతో వచ్చిన ‘ఒకే ఒక జీవితం' మూవీకి అంచనాలు లేకపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 8 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 5 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 6.83 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 1.17 కోట్లు వస్తేనే ఇది హిట్ చిత్రంగా నిలుస్తుంది.

    టాక్ ఉన్నా వసూళ్లు మాత్రం

    టాక్ ఉన్నా వసూళ్లు మాత్రం

    శర్వానంద్ హీరోగా టైం ట్రావెల్ నేపథ్యంతో వచ్చిన ‘ఒకే ఒక జీవితం' మూవీకి టాక్‌తో పాటు రివ్యూలు కూడా పాజిటివ్‌గా వచ్చాయి. కానీ, ప్రేక్షకుల నుంచి స్పందన మాత్రం అనుకున్న రేంజ్‌లో రాలేదు. దీంతో కలెక్షన్లు మాత్రం ఆశించిన రీతిలో రాట్లేదు. వీక్ డేస్ కావడంతో వసూళ్లు క్రమంగా పడిపోతోన్నాయి. ఇదే కంటిన్యూ అయితే మరింత డౌన్ అయ్యే ప్రమాదం ఉంది.

    English summary
    Young actor Sharwanand Did Oke Oka Jeevitham Movie Under Shree Karthick Direction. This Movie Collects Rs 6.83 Cr in 5 Days
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X