Don't Miss!
- News జూన్ 4 ఫలితాలతో ఏపీలో జరగబోయేదేంటి..!!
- Sports Rohit x Hardik: పదేళ్లుగా కెప్టెన్సీ చేశా.. ఎలా గెలవాలో తెలుసు- రోహిత్
- Lifestyle Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Technology వన్‌ప్లస్ 11R 5G కొత్త వేరియంట్ విడుదల.. అమెజాన్‌లో ఈ కార్డులపై రూ.1000 తగ్గింపు..!
- Automobiles జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
Oke Oka Jeevitham Collections: ఆ మార్కును దాటేసిన మూవీ.. ఇంకొన్ని లక్షలు వస్తే హిట్టే!
తెలుగు సినీ ఇండస్ట్రీలో హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేసే హీరోలు చాలా తక్కువ మందే ఉన్నారు. అందులో టాలెంటెడ్ గాయ్ శర్వానంద్ ఒకడు. విలక్షణమైన నటనతో ఎన్నో సినిమాలను ఒంటి చేత్తో నడిపించిన అతడు.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు. కానీ, విజయాలను మాత్రం అంతగా అందుకోవడం లేదు.
మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వరుస పరాజయాలతో సతమతం అవుతోన్నాడు. ఈ పరిస్థితుల్లో ఇటీవలే శర్వానంద్ 'ఒకే ఒక జీవితం' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమాకు కలెక్షన్లు కూడా బాగానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'ఒకే ఒక జీవితం' మూవీ 6 రోజుల బాక్సాఫీస్ రిపోర్టును చూద్దాం పదండి!
ఒకే ఒక జీవితంలో ఎవరెవరంటే
శర్వానంద్ హీరోగా శ్రీ కార్తీక్ తెరకెక్కించిన టైం ట్రావెల్ మూవీనే 'ఒకే ఒక జీవితం'. రీతూ వర్మ హీరోయిన్గా నటించిన ఇందులో అమల, ప్రియదర్శి, వెన్నెల కిశోర్, నాజర్‌లు కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రభు నిర్మించారు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయింది. జాక్స్ బిజాయ్ ఈ మూవీకి సంగీతం అందించారు.
Bigg Boss Telugu 6: షోలో గీతూ ఊహించని పని.. అందరి ముందే బట్టలు విప్పేసి మరీ!
థియేట్రికల్ బిజినెస్ వివరాలివే
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో శర్వానంద్‌కు పెద్దగా మార్కెట్ లేదు. దీనికితోడు ఈ మధ్య హిట్లు కూడా లేవు. దీంతో 'ఒకే ఒక జీవితం' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రూ. 6.50 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్లలో కలిపి రూ. 1.00 కోట్లు వ్యాపారం జరిగింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 7.50 కోట్ల బిజినెస్ అయింది.
6వ రోజు ఎక్కడ ఎంతొచ్చింది?
6 రోజు 'ఒకే ఒక జీవితం' మూవీకి వసూళ్లు మళ్లీ తగ్గిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 18 లక్షలు, సీడెడ్‌లో రూ. 3 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 5 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. ఏపీ, తెలంగాణలో రూ. 35 లక్షలు షేర్, రూ. 60 లక్షలు గ్రాస్ వసూలైంది.
శృతి మించిన నందినీ హాట్ షో: టాప్ అందాలను ఆరబోస్తూ రచ్చ
6 రోజులకు కలిపి ఎంతొచ్చింది?
శర్వానంద్ 'ఒకే ఒక జీవితం'కు 6 రోజుల్లో వసూళ్లు బాగానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 2.38 కోట్లు, సీడెడ్‌లో రూ. 37 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 51 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 35 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 24 లక్షలు, గుంటూరులో రూ. 32 లక్షలు, కృష్ణాలో రూ. 30 లక్షలు, నెల్లూరులో రూ. 19 లక్షలతో కలిపి రూ. 4.67 కోట్లు షేర్, రూ. 7.80 కోట్లు గ్రాస్ వసూలైంది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది
ఏపీ,
తెలంగాణలో
6
రోజుల్లో
రూ.
4.67
కోట్లు
వసూలు
చేసిన
'ఒకే
ఒక
జీవితం'
మూవీ..
ప్రపంచ
వ్యాప్తంగానూ
పర్వాలేదనిపించింది.
ఫలితంగా
కర్నాటక,
రెస్టాఫ్
ఇండియా
రూ.
38
లక్షలు
తమిళ
వెర్షన్‌కు
రూ.
85
లక్షలు,
ఓవర్సీస్లో
రూ.
1.40
కోట్లు
కలెక్ట్
చేసింది.
దీంతో
6
రోజుల్లో
ఈ
సినిమాకు
ప్రపంచ
వ్యాప్తంగా
రూ.
7.30
కోట్లు
షేర్,
రూ.
16.60
కోట్లు
గ్రాస్
వచ్చింది.
బిందు మాధవి ఎద అందాల అరాచకం: పైన ఏమీ లేకపోవడంతో!
టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి
టైం ట్రావెల్ కథతో ఎమోషనల్‌గా వచ్చిన 'ఒకే ఒక జీవితం' మూవీకి అంచనాలు లేకపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 8 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 6 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.30 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 70 లక్షలు వస్తేనే ఇది హిట్ చిత్రంగా నిలుస్తుంది.
హిట్‌కు కొద్ది దూరంలోనే ఉంది
శర్వానంద్ హీరోగా నటించిన 'ఒకే ఒక జీవితం' మూవీకి టాక్‌తో పాటు రివ్యూలు కూడా పాజిటివ్‌గా వచ్చాయి. అయితే, తెలుగు ప్రేక్షకుల నుంచి దీనికి స్పందన అనుకున్నట్లు రాలేదు. కానీ, ఓవర్సీస్, తమిళ్లో మాత్రం వసూళ్లు పెరుగుతున్నాయి. దీంతో ఈ చిత్రం రూ. 7 కోట్ల షేర్ మార్కును దాటేసింది. తద్వారా హిట్ స్టేటస్‌కు మరింత చేరువగానే వచ్చిందని చెప్పుకోవచ్చు.