For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Oke Oka Jeevitham Collections: రికార్డు‌కు చేరువైన శర్వానంద్.. ఇంకా అన్ని లక్షలు వస్తే హిట్టే!

    |

    సినీ బ్యాగ్రౌండ్ లేకుండానే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్న హీరో శర్వానంద్. సహజసిద్ధమైన నటనతో ప్రతి సినిమానూ వన్ మ్యాన్ షోగా మార్చేస్తున్న అతడు.. క్రమక్రమంగా తన మార్కెట్‌తో పాటు ఫాలోయింగ్‌ను పెంచుకుంటోన్నాడు. తద్వారా ఫలితాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తోన్నాడు.

    ఈ క్రమంలోనే ఇటీవలే శర్వానంద్ 'ఒకే ఒక జీవితం' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమాకు కలెక్షన్లు కూడా మంచిగానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'ఒకే ఒక జీవితం' మూవీ ఎనిమిది రోజుల బాక్సాఫీస్ రిపోర్టును చూద్దాం పదండి!

    ఒకే ఒక జీవితం మూవీ బ్యాగ్రౌండ్

    ఒకే ఒక జీవితం మూవీ బ్యాగ్రౌండ్

    శర్వానంద్ - శ్రీ కార్తీక్ కాంబినేషన్‌లో వచ్చిన టైం ట్రావెల్ మూవీనే 'ఒకే ఒక జీవితం'. రీతూ వర్మ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో అమల, ప్రియదర్శి, వెన్నెల కిశోర్, నాజర్‌లు కీలక పాత్రలు పోషించారు. దీన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రభు నిర్మించారు. జాక్స్ బిజాయ్ ఈ మూవీకి సంగీతం అందించారు. ఇది తెలుగు, తమిళంలో రిలీజ్ అయింది.

    దిశా పటానీ ఎద అందాల ప్రదర్శన: వామ్మో ఆమెనిలా చూస్తే నిద్ర పట్టదు!

    థియేట్రికల్ బిజినెస్ వివరాలివే

    థియేట్రికల్ బిజినెస్ వివరాలివే

    శర్వానంద్‌కు ఆంధ్రా, తెలంగాణ ఏరియాల్లో పెద్దగా మార్కెట్ లేదు. దీనికితోడు ఈ మధ్య అతడికి హిట్లు కూడా లేవు. దీంతో 'ఒకే ఒక జీవితం' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రూ. 6.50 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లలో కలిపి రూ. 1.00 కోట్లు వ్యాపారం జరిగింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 7.50 కోట్ల బిజినెస్ అయింది.

    8వ రోజు ఎక్కడ ఎంతొచ్చింది?

    8వ రోజు ఎక్కడ ఎంతొచ్చింది?

    'ఒకే ఒక జీవితం' మూవీకి 8 రోజు వసూళ్లు బాగా తగ్గిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 6 లక్షలు, సీడెడ్‌లో రూ. 1 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 2 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 1 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో కలిపి ఏపీ, తెలంగాణలో రూ. 15 లక్షలు షేర్, రూ. 25 లక్షలు గ్రాస్ వసూలైంది.

    బెడ్‌పై ఈషా రెబ్బా అందాల ఆరబోత: నెట్ డ్రెస్‌లో మొత్తం కనిపించేలా!

    వారం రోజుల్లో ఎంత వచ్చింది?

    వారం రోజుల్లో ఎంత వచ్చింది?

    8 రోజుల్లో శర్వానంద్ 'ఒకే ఒక జీవితం'కు వసూళ్లు బాగానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 2.54 కోట్లు, సీడెడ్‌లో రూ. 40 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 57 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 38 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 26 లక్షలు, గుంటూరులో రూ. 37 లక్షలు, కృష్ణాలో రూ. 33 లక్షలు, నెల్లూరులో రూ. 21 లక్షలతో కలిపి రూ. 5.06 కోట్లు షేర్, రూ. 8.45 కోట్లు గ్రాస్ వసూలైంది.

    ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

    ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

    ఏపీ, తెలంగాణలో 8 రోజుల్లో రూ. 5.06 కోట్లు వసూలు చేసిన 'ఒకే ఒక జీవితం' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ పర్వాలేదనిపించింది. ఫలితంగా కర్నాటక, రెస్టాఫ్ ఇండియా రూ. 42 లక్షలు తమిళ వెర్షన్‌కు రూ. 94 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.45 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో 8 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.87 కోట్లు షేర్‌, రూ. 18.10 కోట్లు గ్రాస్ వచ్చింది.

    బీచ్‌లో బికినీలో రెచ్చిపోయిన శ్రీయ: ఆ పార్టులన్నీ చూపిస్తూ దారుణంగా!

    టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి

    టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి

    టైం ట్రావెల్ కథతో వచ్చిన 'ఒకే ఒక జీవితం' మూవీకి అంచనాలు లేకపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 8 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 8 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.87 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 13 లక్షలు వస్తేనే ఇది హిట్ చిత్రంగా నిలుస్తుంది.

    చాలా రోజుల తర్వాత హిట్‌ వైపు

    చాలా రోజుల తర్వాత హిట్‌ వైపు

    శర్వానంద్ హీరోగా నటించిన 'ఒకే ఒక జీవితం' మూవీకి టాక్‌తో పాటు రివ్యూలు కూడా పాజిటివ్‌గా వచ్చాయి. మొదట్లో ఆశించిన స్పందన రాకున్నా.. క్రమంగా తెలుగుతో పాటు ఓవర్సీస్, తమిళ్‌లో మాత్రం వసూళ్లు బాగానే వచ్చాయి. దీంతో ఈ చిత్రం హిట్ స్టేటస్‌కు చేరువ అయింది. శనివారం వసూళ్లతో ఇది టార్గెట్‌ను చేరు అవకాశం ఉంది. ఇదే జరిగితే శర్వాకు హిట్ వస్తుంది.

    English summary
    Young actor Sharwanand Did Oke Oka Jeevitham Movie Under Shree Karthick Direction. This Movie Collects Rs 7.87 Cr in 8 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X