twitter
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

Oke Oka Jeevitham Total Collections: 7.50 కోట్లకు అమ్మితే.. ఊహించని వసూళ్లు.. లాభం ఎన్ని కోట్లంటే!

స్వయంకృషితో హీరోగా పరిచయం అయినా.. తనదైన విలక్షణమైన నటనతో చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుని.. వరుస సినిమాలతో సత్తా చాటుతోన్నాడు టాలెంటెడ్ హీరో శర్వానంద్. చాలా రోజులుగా సరైన హిట్ లేక ఇబ్బందులు పడుతోన్న ఈ యంగ్ హీరో.. కొద్ది రోజుల క్రితమే 'ఒకే ఒక జీవితం' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన ఈ మూవీకి పాజిటివ్ టాక్‌తో పాటు కలెక్షన్లు కూడా మంచిగానే వచ్చాయి. ఈ నేపథ్యంలో 'ఒకే ఒక జీవితం' ఫైనల్ బాక్సాఫీస్ రిపోర్టుపై లుక్కేద్దాం పదండి!

ఒకే ఒక జీవితం అంటూ వచ్చారు

ఒకే ఒక జీవితం అంటూ వచ్చారు

శర్వానంద్ హీరోగా శ్రీ కార్తీక్ రూపొందించిన టైం ట్రావెల్ మూవీనే 'ఒకే ఒక జీవితం'. రీతూ వర్మ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో అమల, ప్రియదర్శి, వెన్నెల కిశోర్, నాజర్‌లు కీలక పాత్రలు పోషించారు. దీన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రభు నిర్మించారు. జాక్స్ బిజాయ్ ఈ మూవీకి సంగీతం అందించారు. ఇది తెలుగు, తమిళంలో నేరుగా విడుదలైంది.

నగ్నంగా సీతా రామం హీరోయిన్: సినిమాలో అలా.. రియల్‌గా ఇంత దారుణంగా!
నగ్నంగా సీతా రామం హీరోయిన్: సినిమాలో అలా.. రియల్‌గా ఇంత దారుణంగా!

థియేట్రికల్ బిజినెస్ వివరాలివే

థియేట్రికల్ బిజినెస్ వివరాలివే

ఆంధ్రా, తెలంగాణలో యంగ్ హీరో శర్వానంద్‌కు పెద్దగా మార్కెట్ లేదు. దీనికితోడు ఈ మధ్య అతడికి హిట్లు కూడా లేవు. దీంతో 'ఒకే ఒక జీవితం' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రూ. 6.50 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లలో కలిపి రూ. 1.00 కోట్లు వ్యాపారం జరిగింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 7.50 కోట్ల బిజినెస్ జరిగింది.

మంచి టాక్.. కలెక్షన్లు భారీగానే

మంచి టాక్.. కలెక్షన్లు భారీగానే

టాలెంటెడ్ హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో నటించిన 'ఒకే ఒక జీవితం' మూవీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విశేషమైన స్పందన దక్కింది. దీంతో కలెక్షన్లు పోటెత్తాయి. ఫలితంగా ఈ సినిమా కేవలం వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకుంది. అదే ప్రపంచ వ్యాప్తంగానూ ప్రభావాన్ని చూపించింది. దీంతో అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమా విశేషమైన వసూళ్లను రాబట్టింది.

అందాల ఆరబోతలో గీత దాటిన దివి: సీక్రెట్ పార్ట్స్ కనిపించేలా హాట్ షో
అందాల ఆరబోతలో గీత దాటిన దివి: సీక్రెట్ పార్ట్స్ కనిపించేలా హాట్ షో

తెలుగు రాష్ట్రాల్లో ఎంతొచ్చింది?

తెలుగు రాష్ట్రాల్లో ఎంతొచ్చింది?

శర్వానంద్ 'ఒకే ఒక జీవితం'కు ఫుల్ రన్‌లో వసూళ్లు బాగానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 3.20 కోట్లు, సీడెడ్‌లో రూ. 60 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 84 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 51 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 36 లక్షలు, గుంటూరులో రూ. 52 లక్షలు, కృష్ణాలో రూ. 50 లక్షలు, నెల్లూరులో రూ. 28 లక్షలతో కలిపి రూ. 6.81 కోట్లు షేర్, రూ. 11.60 కోట్లు గ్రాస్ వసూలైంది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ఏపీ, తెలంగాణలో ముగింపు సమయానికి రూ. 6.33 కోట్లు వసూలు చేసిన 'ఒకే ఒక జీవితం' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగా పర్వాలేదనిపించింది. ఫలితంగా కర్నాటక, రెస్టాఫ్ ఇండియా రూ. 62 లక్షలు, తమిళంలో రూ. 1.45 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.15 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 11.03 కోట్లు షేర్‌, రూ. 26.15 కోట్లు గ్రాస్ వచ్చింది.

స్టార్ హీరోయిన్‌‌ను ఇబ్బంది పెడుతున్న నిర్మాత: పెళ్లి చేసుకోకుండా అలా చేయమంటూ!
స్టార్ హీరోయిన్‌‌ను ఇబ్బంది పెడుతున్న నిర్మాత: పెళ్లి చేసుకోకుండా అలా చేయమంటూ!

టార్గెట్ ఎంత? లాభాలు ఎంత?

టార్గెట్ ఎంత? లాభాలు ఎంత?

టైం ట్రావెల్ కథతో వచ్చిన 'ఒకే ఒక జీవితం' మూవీకి అంచనాలు లేకపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 8 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా ఫుల్ రన్‌లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 11.03 కోట్లు వసూలు చేసింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 3.03 కోట్లు లాభాలు కూడా వచ్చాయి.

ఆ ఓటీటీలో మొదలైన స్ట్రీమింగ్

ఆ ఓటీటీలో మొదలైన స్ట్రీమింగ్

శ్రీ కార్తీక్ దర్శకత్వంలో టాలెంటెడ్ గాయ్ శర్వానంద్ హీరోగా నటించిన 'ఒకే ఒక జీవితం' థియేటర్లలో చాలా రోజుల పాటు సందడి చేసింది. దీంతో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఈ క్రమంలోనే ఇప్పుడు సోనీ లివ్‌లో ఈ చిత్రం నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇక్కడ కూడా దీనికి మంచి స్పందన వస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై చిత్ర యూనిట్ ఖుషీగా ఉంది.

English summary
Young actor Sharwanand Did Oke Oka Jeevitham Movie Under Shree Karthick Direction. This Movie Collects Rs 11.03 Cr in Full Run.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X