Oke Oka Jeevitham pre release bussiness: శర్వా డీసెంట్ బాక్సాఫీస్ టార్గెట్.. ఈసారైనా ఫినిష్ చేస్తాడా?

హీరో శర్వానంద్ చాలా కాలంగా వరుస అపజయాలతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఇక ఈసారి ఎలాగైనా సక్సెస్ అందుకొని ట్రాక్ లోకి రావాలని అనుకుంటున్నాడు. కొత్త దర్శకుడు శ్రీ కార్తీక్ దర్శకత్వంలో చేసిన ఒకే ఒక జీవితం సినిమా నేడు వరల్డ్ వైడ్ గా తమిళ్ తెలుగులో ఒకేసారి విడుదలైంది. ఇక సినిమా మార్కెట్ లో ఎంత బిజినెస్ చేసింది సక్సెస్ కావాలి అంటేమొత్తం ఎంత రాబట్టాలి అనే వివరాల్లోకి వెళితే..

టైమ్ ట్రావెల్ నేపథ్యంలో

టైమ్ ట్రావెల్ నేపథ్యంలో

శర్వానంద్ చివరగా నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని అందుకుంది. అంతకుముందు వచ్చిన మహా సముద్రం కూడా ఫ్లాప్ అయ్యింది. ఇక శర్వానంద్ కెరీర్ లో చాలా కాలం తరువాత వరుస అపజయాలను అందుకోవడంతో అతని మార్కెట్ పై తీవ్ర ప్రభావం కూడా పడుతోంది. ఇక ఫైనల్ గా శర్వా ఇప్పుడు టైమ్ ట్రావెల్ నేపథ్యంలో ఓకే ఒక జీవితం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఆసక్తికరమైన కథాంశం

ఆసక్తికరమైన కథాంశం

శర్వానంద్ తో పాటు ప్రముఖ తారాగణం ఈ సినిమాలో హైలెట్ కానుంది. ముఖ్యంగా వెన్నెల కిషోర్ అలాగే ప్రియదర్శి నాజర్ వంటి వారు కథను మలుపు తిప్పే కీలకమైన పాత్రల్లో నటించారు. ట్రైలర్ లోనే సినిమాకు సంబంధించిన అసలు పాయింట్ ను హైలెట్ చేశారు. ముగ్గురు యువకులు వారి గతానికి వెళ్లి ఏం చేశారు అనే కాన్సెప్ట్ లో ఎమోషనల్ కామెడీ ఎంటర్టైనర్ గా సినిమాను తెరకెక్కించారు.

థియేటర్ల సంఖ్య

థియేటర్ల సంఖ్య

ఒకే ఒక జీవితం సినిమాకు ట్రైలర్ ద్వారానే కొంత పాజిటివ్ వైబ్రేషన్ అయితే పెరిగాయి. ఇక ఈ సినిమా డిమాండ్ ను బట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో లిమిటెడ్ థియేటర్లలోనే విడుదల చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏ ఏరియాలో ఎన్ని థియేటర్లలో విడుదల చేస్తున్నారు అంటే నైజాంలో 120 సీడెడ్ లో 60 మొత్తం ఆంధ్రాలో 200 థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఇక మొత్తం ఏపీ తెలంగాణలో చూసుకుంటే 385 థియేటర్లు ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 585 థియేటర్లలో ఈ సినిమా విడుదలవుతోంది.

ప్రీ రిలీజ్ బిజినెస్

ప్రీ రిలీజ్ బిజినెస్

ఇక సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత చేసింది అనే వివరాల్లోకి వెళితే.. నైజం లో 2.5 కోట్లు సీడెడ్ లో 0.8 కోట్లు మొత్తం ఆంధ్రలో 3.20 కోట్ల వరకు ఈ సినిమా బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మొత్తం చూసుకుంటే 6.50 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు సమాచారం. ఇక తమిళనాడు కర్ణాటక రెస్టాఫ్ ఇండియా ఓవర్సీస్ లో మరో కోటి వరకు బిజినెస్ చేసింది.

 బాక్సాఫీస్ టార్గెట్

బాక్సాఫీస్ టార్గెట్

మొత్తం మీద సినిమా ప్రపంచవ్యాప్తంగా శర్వా రేంజ్ తగ్గట్టుగా 7.5 కోట్ల బిజినెస్ తో మార్కెట్లోకి అడుగు పెట్టింది. ఇక మొత్తంగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ చూసుకుంటే 8 కోట్లుగా నమోదయింది. బాక్సాఫీస్ వద్ద ఆ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటేనే హిట్ అయినట్లు లెక్క. సినిమాకు మొదటి రోజు వచ్చిన టాక్ చూస్తే మంచి డీసెంట్ కలెక్షన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక వీకెండ్ లో ఏ మాత్రం క్లిక్ అయినా కూడా టార్గెట్ ను ఈజీగానే ఫినిష్ చేస్తుంది. మరి శర్వా ఇమేజ్ ఈ సినిమాకు ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X