సినిమా సంగతెలా ఉన్నా బాలకృష్ణ సినిమా కలెక్షన్లు మాత్రం రికార్డు స్థాయిలో ఉన్నట్టు ఫిల్మ్ నగర్ లో ప్రచారం జరుగుతోంది. విడుదలైన తొలి రోజే ఈ సినిమా రూ.7కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. అసలు సినిమా పంపిణీ హక్కుల అమ్మకాలకే ఇంతకుముందెన్నడూ బాలకృష్ణ సినిమాలకు రానంతగా రూ.25 కోట్ల బిజినెస్ కాగా తొలి రోజు కలెక్షన్లు రికార్డును బ్రేక్ చేశాయి. నైజాం ఏరియాలో 150 థియేటర్లలో, వైజాగ్ ఏరియాలో 40, సీడెడ్ లో 80 థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా మొత్తంగా 500 థియేటర్లలో విడుదల అయింది. ఈ నెల 10వ తేదీ రాత్రినుంచే ఆగకుండా ఒక షో తరువాత మరో షో వరుసగా 24 గంటలూ ప్రదర్శన జరుగుతున్నట్టు తెలిసింది. ఈ ఉధృతి ఆంధ్ర, సీడెడ్ ఏరియాలో ఈ జోరు కొనసాగుతోంది. బ్లాక్ టికెట్లు అమ్మేవారి పంటపండిందని, ఒక్క మగాడు అభిమానులను రంజింపజేస్తున్నాడని అనుకుంటున్నారు.