Om Bheem Bush Closing Collections 10 కోట్ల బడ్జెట్.. ఓం భీమ్ బుష్ హిట్టా? ఫట్టా?
హుషారు సినిమాతో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిపించుకొన్న శ్రీ హర్ష డైరెక్షన్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్ సమర్పణలో సునీల్ బలుసు నిర్మాతగా రూపొందిన చిత్రం ఓం భీమ్ బుష్. యువ హీరో శ్రీ విష్ణు, కమెడియన్లు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ నటించిన కామెడీ, ఎమోషనల్, లవ్ స్టోరి చిత్రంలో కామాక్షి భాస్కర్ల, ఆయేషా ఖాన్, ప్రతీ ముకుందన్ తదితరులు నటించారు. ఈ సినిమా సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
ఓం భీమ్ బుష్. హుషారు ఫేమ్ శ్రీ హర్ష దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తొలి రోజు నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్నది. ప్రముఖ నిర్మాత సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్ సమర్పణలో సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రంలో కామాక్షి భాస్కర్ల, ఆయేషా ఖాన్, ప్రీతి ముకుందన్ తదితరులు నటించారు.

వినోదం, భావోద్వేగాలను జోడించి రూపొందించిన ప్రేమ కథా చిత్రాన్ని సుమారుగా 10 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో 8 కోట్ల రూపాయలు, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు 10 కోట్ల మేర బిజినెస్ జరిగింది. 11 కోట్ల రూపాయల బాక్సాఫీస్ జర్నీని ఈ సినిమా మొదలుపెట్టింది.
ఇక ట్రైలర్లు, ప్రమోషనల్ కంటెంట్‌కు బజ్ క్రియేట్ చేస్తే.. ప్రేక్షకుల నుంచి భారీగా రెస్సాన్స్ అడ్వాన్స్ బుకింగ్ రూపంలో కనిపించింది. దాంతో ఈ సినిమాను సుమారుగా తెలుగు రాష్ట్రాల్లో అంటే.. ఆంధ్రా, నైజాంలో 700 స్క్రీన్లు, ప్రపంచవ్యాప్తంగా 1100 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో మరిన్నీ స్క్రీన్లను పెంచారు.

ఓం భీమ్ బుష్‌కు క్రిటిక్స్ పాజిటివ్‌గా స్పందించడంతో తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 3.6 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఆ తర్వాత రెండో రోజు 4 కోట్లు రూపాయలు రాబట్టింది. మూడో రోజు 3.5 కోట్లు, నాలుగో రోజు 3 కోట్ల రూపాయల కలెక్షన్లు నమోదు చేసింది. తొలివారం ముగిసే సమయానికి ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, ఇతర ప్రాంతాలతో కలిపి మొత్తంగా 11 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
ఇక రెండోవారంలో ఈ సినిమా ఓ మోస్తారు కలెక్షన్లతో జర్నీని కొనసాగించింది. తొలివారంలో నమోదు చేసిన కలెక్షన్ల ఊపు రెండోవారంలో కనిపించలేదు. దాంతో ఈ సినిమా 15 రోజుల్లో 13.5 కోట్ల రూపాయలకుపైగా వసూళ్లను సాధించింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మంచి లాభాలతో ముగిసింది. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌కు భారీ రేటు పలికింది.


Click it and Unblock the Notifications











