Om Bheem Bush Day Box Office Report 2 రికార్డు కలెక్షన్లతో ఓం భీమ్ బుష్.. ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
హుషారు ఫేమ్ శ్రీ హర్ష దర్శకత్వంలో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఓం భీమ్ బుష్. ప్రముఖ నిర్మాత సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను సునీల్ బలుసు నిర్మించాడు. కామాక్షి భాస్కర్ల, ప్రియా వడ్లమాని, ఆయేషా ఖాన్, ప్రీతి ముకుందన్ నటించిన ఈ చిత్రం మార్చి 22వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ సినిమా సాధిస్తున్న కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
కష్టపడకుండా జీవితాన్ని పూర్తిస్థాయిలో విందులు, విలాసాలతో ఆస్వాదించాలనే కోరిక కలిగిన ముగ్గురు యువకులకు తమ ప్రతిభను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 400 ఏళ్ల క్రితం నాటి పురాతన బంగ్లాలో సంపంగి అనే దెయ్యం కోరికలను జయించి.. నిధిని తీసుకు రావడానికి లోపలికి వెళ్లిన వారికి ఏం జరిగింది? వారికి ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయనేది ఓం భీమ్ బుష్ సినిమా కథ.

ఓం భీమ్ బుష్ సినిమాను భారీ సెట్టింగ్స్, గ్రాఫిక్స్‌తో అత్యున్నత సాంకేతికతతో రూపొందించడంతో బడ్జెట్ భారీగా పెరిగిపోయింది. నటీనటులు, సాంకేతిక నిపుణులు రెమ్యునరేషన్లు కలిపి ఈ మూవీ 25 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో 800 స్క్రీన్లకుపైగా, ఇతర రాష్ట్రాల్లో 100 స్క్రీన్లు, అలాగే ఓవర్సీస్‌లో 400 స్క్రీన్లలో కలిపి ఈ మూవీని సుమారుగా 1300 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.
శ్రీవిష్ణు నటించిన ఈ సినిమాకు ఓవర్సీస్‌లో భారీ ఆదరణ దక్కుతున్నది. ఈ సినిమా ప్రీమియర్లు, మొదటి రోజు కలెక్షన్లు 175K డాలర్లు అంటే 1.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో 3.1 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ తొలి రోజు 4.6 కోట్లు రాబట్టడమే కాకుండా అంచనాలు మించి కలెక్షన్లను రాబట్టింది.
ఇక రెండో రోజు ఆక్యుపెన్సీ వివరాల్లోకి వెళితే.. మార్నింగ్ షోకు 30 శాతం, మ్యాట్నీకి 35 శాతం, మార్నింగ్ షోకు 40 శాతం, సెకండ్ షోకు 45 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. కరీంనగర్ 42 శాతం, కాకినాడ, వరంగల్, గుంటూరు, హైదరాబాద్‌లో 30 శాతానికిపైగా ఆక్యుపెన్సీ నమోదైంది. ముంబై, బెంగళూరు, చెన్నైలో భారీ ఆక్యుపెన్సీ నమోదైంది.
ఓం భీమ్ బుష్ సినిమా రెండో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం తొలి రోజు కంటే రెండో రోజు అధికంగా వసూళ్లు నమోదు చేస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించారు. ఓవర్సీస్‌లో 200K, తెలుగు, ఇతర రాష్ట్రాల్లో 3 కోట్లకుపైగా వసూళ్లు సాధిస్తుందని తెలిపారు. మొత్తంగా రెండో రోజు ఈ సినిమా 5.5 కోట్ల మేర వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











