Om Bheem Bush Day 4 Collections బాక్సాఫీస్ వద్ద ఓం భీమ్ బుష్ కలెక్షన్ల మోత.. 4 రోజుల్లో ఎన్ని కోట్లంటే?

యువ హీరో శ్రీ విష్ణు, కమెడియన్లు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ నటించిన కామెడీ, ఎమోషనల్, లవ్ స్టోరి ఓం భీమ్ బుష్. హుషారు ఫేమ్ శ్రీ హర్ష దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తొలి రోజు నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్నది. ప్రముఖ నిర్మాత సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్‌ సమర్పణలో సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రంలో కామాక్షి భాస్కర్ల, ఆయేషా ఖాన్, ప్రీతి ముకుందన్ తదితరులు నటించారు. ఈ సినిమా 4వ రోజు సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

పూర్తిగా వినోదాత్మకంగా రూపొందిన ఈ చిత్రాన్ని సుమారుగా 20 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా టీజర్లు, ట్రైలర్లు, ఇతర ప్రమోషనల్ కార్యక్రమాలకు మంచి స్పందన రావడంతో బిజినెస్ కూడా భారీగానే జరిగింది. శ్రీ విష్ణు కెరీర్ అత్యధికంగా బిజినెస్ జరిగిన చిత్రాల్లో ఒకటిగా ఈ చిత్రం నిలిచింది.

Om Bheem Bush Day 4

ఓం భీమ్ బుష్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాల్లోకి వెళితే.. నైజాం థియేట్రికల్ హక్కులు 3 కోట్ల రూపాయలు, సీడెడ్, ఆంధ్రా కలిపి 5 కోట్ల రూపాయల మేర అమ్ముడుపోయాయి. దాంతో తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ 8 కోట్లుగా జరిగింది. ఇక కర్ణాటక, ఇతర రాష్ట్రాల బిజినెస్ సుమారుగా 1 కోటి రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ మరో కోటి రూపాయలు అమ్ముడుపోవడంతో ఈ సినిమా మొత్తంగా 10 కోట్ల రూపాయల మేర బిజినెస్ క్లోజ్ చేశారు.

ఇక మూవీ ప్రీమియర్లకు పాజిటివ్ టాక్ లభించడంతో ఓపెనింగ్స్ భారీగానే నమోదయ్యాయి. ప్రతీ షోకు కలెక్షన్లు పెంచుకొంటూ వెళ్లింది. తొలి రోజు ఈ సినిమా సుమారుగా 3.7 కోట్ల రూపాయలు, రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో 3 కోట్లు, 4 కోట్ల రూపాయలు ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసింది. ఇక మూడో రోజు 3.5 కోట్ల రూపాయలు రాబట్టడంతో మూడు రోజుల్లోనే 11 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది. ఓవర్సీస్‌లో కలిపి 13.7 కోట్ల రూపాయలు నమోదు చేసింది.

ఇక ఓం భీమ్ బుష్ సినిమా తొలి రోజు కంటే నాలుగో రోజు అధికంగా కలెక్షన్లు రాబట్టింది. సోమవారం హోళీ పండుగ నేపథ్యంలో హాలీడే కావడంతో కలెక్షన్లు భారీగానే వచ్చాయి. ఈ సినిమా ఇండియాలో 2 కోట్ల గ్రాస్, ప్రపంచవ్యాప్తంగా 1 కోటి రూపాయలు గ్రాస్‌తో మొత్తంగా 3 కోట్ల వరకు ఈ సినిమా వసూళ్లు రాబట్టింది. దాంతో ఈ సినిమా 17 కోట్ల మేర వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X