Om Bheem Bush Collections భారీ ఓపెనింగ్స్‌తో ఓం భీమ్ బుష్.. ఎన్ని కోట్ల కలెక్షన్లు.. లాభాల్లోకి రావాలంటే?

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్‌ సమర్పణలో వీ సెల్యూలాయిడ్ బ్యానర్‌పై సునీల్ బలుసు నిర్మించిన చిత్రం ఓం భీమ్ బుష్. హుషారు ఫేమ్ శ్రీ హర్ష దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతీ ముకుందన్, కామక్షి భాస్కర్ల, ప్రియావడ్లమాని, ఆయేషా ఖాన్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, రచ్చ రవి, షాన్ కక్కర్, సూర్య శ్రీనివాస్ తదితరులు నటించారు. మార్చి 22వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ సినిమా బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

ఎలాంటి కష్టం లేకుండా జీవితాన్ని విలాసవంతంగా గడపాలనే ముగ్గురు యువకులు ఓ గ్రామంలో బ్యాంగ్ బ్రో అనే ఏజెన్సీని పెట్టి కులాసాగా జీవిస్తుంటారు. ప్రజల మూఢ నమ్మకాలు, బలహీనతలను క్యాష్ చేసుకొంటూ లైఫ్‌ను జాలీగా లీడ్ చేస్తుంటారు. అయితే అనుకొని పరిస్థితుల్లో గ్రామస్థుల ముందు తమ శక్తి సామర్ధ్యాలను నిరూపించుకోవడానికి 400 సంవత్సరాల భూత్ బంగ్లాలోకి అడుగు పెడుతారు. ఆ తర్వాత వారి జీవితాల్లో ఏం జరిగిందనే సినిమా కథ.

Om Bheem Bush Expected Box Office Collections Worldwide Sree Vishnu s movie minting good at GBOC

ఓ భీమ్ బుష్ సినిమాను అత్యుత్తమ సాంకేతిక నిపుణులు, టాలెంటెడ్ యాక్టర్ల మేళవింపుతో రూపొందించారు. రిచ్ ప్రాడక్షన్ వ్యాల్యూస్‌తో నిర్మించడంతో భారీగా ఖర్చు అయింది. ఈ సినిమాకు రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ వాల్యూస్‌తో కలిపి ఈ సినిమాను 25 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సొంతంగా రిలీజ్ చేశారు.

ఓం భీమ్ బుష్ సినిమా ప్రమోషన్స్‌కు మంచి బజ్ క్రియేట్ చేయడంతో గ్రాండ్‌గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశారు. ఈ సినిమాను ఆంధ్రా, నైజాంలో అత్యధిక థియేటర్లలో విడుదల చేశారు.తెలుగు రాష్ట్రాల్లో 800 స్క్రీన్లకుపైగా, ఇతర రాష్ట్రాల్లో 100 స్క్రీన్లు, అలాగే ఓవర్సీస్‌లో 400 స్క్రీన్లలో కలిపి ఈ మూవీని సుమారుగా 1300 స్క్రీన్లలో రిలీజ్ చేశారు

Om Bheem Bush Expected Box Office Collections Worldwide Sree Vishnu s movie minting good at GBOC

శ్రీవిష్ణు నటించిన ఈ సినిమాను ఒక రోజు ముందే ప్రీమియర్స్ వేయడంతో పాజిటివ్ టాక్ బిల్డ్ అయింది. దాంతో మార్చి 22వ తేదీ ఉదయమే భారీగా ఆక్యుపెన్సీ కనిపించింది.ఈ సినిమా మార్నింగ్ షోకు 40 శాతం, మ్యాట్నికి 45 శాతం, ఫస్ట్ షోకు 55 శాతం, సెకండ్ షోకు 60 శాతం ఆక్యుపెన్సీ నమోదు అవుతుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక హర్ష కొనుగంటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి భారీ ఓపెన్సింగ్ నమోదుఅయ్యేలా ఉన్నాయి. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా 2 కోట్ల రూపాయల గ్రాస్, అలాగే వరల్డ్ వైడ్‌గా 3 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

ఇక రెండో రోజు ఇండియాలో 1.5 కోట్లు, వరల్డ్ వైడ్ 2.5 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించేలా ఉంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దాటలంటే.. ఈ సినిమా 10 కోట్ల షేర్, 20 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించాల్సి ఉంటుందని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X