Om Shanti Shanti Shanti Box Office: షాకింగ్‌గా ఓం శాంతి శాంతి శాంతి కలెక్షన్లు..తరుణ్ మూవీకి ఎన్ని కోట్లంటే
యాక్టర్, డైరెక్టర్ తరుణ్ భాస్కర్, యంగ్ హీరోయిన్ ఇషా రెబ్బా జంటగా నటించిన తాజా చిత్రం ఓం శాంతి శాంతి శాంతి హీ. మలయాళంలో ఘన విజయం సాధించిన జయ జయ జయ జయహే చిత్రం రీమేక్‌గా రూపొందిన ఈ సినిమాకు ఏఆర్ సంజీవ్ దర్శకత్వం వహించారు. రొమాంటిక్, ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాను సృజన్ యరబోలు, వివేక్ కృష్ణని, అనూప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ శ్రీనివాసవరపు నిర్మించారు. బ్రహ్మానందం, బ్రహ్మజీ, సురభి ప్రభావతి, రోహిణి తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఈ మూవీ సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. మ్యూజిక్: జయ్ క్రిష్, సాహిత్యం: భరద్వాజ్, సినిమాటోగ్రాఫర్: దీపక్ యరగెరా వ్యవహరించారు. ఈ చిత్రం జనవరి 30వ తేదీన తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్‌లో రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాపై క్రేజ్ ఉండటంతో 29వ తేదీన ప్రీమియర్లను ప్రదర్శించారు. ఈ సినిమా బడ్జెట్ ఎంత? థియేట్రికల్ రైట్స్ వాల్యూ ఎంత? ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూలు చేసిన కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

కొత్తగా పెళ్లైన భార్య భర్తల మధ్య వివాదాలు, పెంకి పెళ్లాం.. మొండి మొగుడు లాంటి కథాంశంతో రూపొందిన ఫన్ డ్రామాను గోదావరి భాష, యాస నేపథ్యంగా తెరకెక్కించారు. ఈ సినిమాను గోదారి అందాల మధ్య రిచ్‌గా చిత్రీకరించారు. ఈ సినిమాలో కాస్ట్ అండ్ క్రూ రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను సుమారుగా 6 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా స్టార్ వాల్యూ ఉండటం, ప్రమోషన్స్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో బిజినెస్ పరంగా కూడా మంచి వాల్యూ పెరిగింది. ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ సుమారుగా 70 లక్షల రూపాయలకు అమ్ముడుపోయాయి. ఓటీటీ రైట్స్ కోసం జీ సంస్థ ఫ్యాన్సీ రేటును చెల్లించింది. మ్యూజిక్ రైట్స్ కూడా మంచి రేటు పలికింది. అయితే థియేట్రికల్‌గా ఈ సినిమాను సొంతంగా రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ రిలీజ్ చేసింది.
ఈ సినిమాను ఒక రోజు ముందే ప్రివ్యూ షోలో వేయడం.. వాటికి మిక్స్‌డ్ రివ్యూలు రావడం జరిగింది. దాంతో ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన లభించింది. అయితే ఓవర్సీస్‌లో అంటే ముఖ్యంగా యూకే, యూఎస్‌లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో కలెక్షన్లు కూడా ఓ మోస్తారుగా వచ్చాయి. ఈ సినిమా ప్రీమియర్లతో కలిపి గత 3 రోజుల్లో 80K డాలర్లు అంటే.. భారతీయ కరెన్సీలో 73 లక్షల రూపాయలు వసూలు చేసింది. రానున్న రోజుల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ఇక ఈ సినిమా తెలుగు రాష్రాల కలెక్షన్ల విషయానికి వస్తే.. ప్రీమియర్ల ద్వారా 42 లక్షల రూపాయలు, తొలి రోజు 35 లక్షల రూపాయలు, రెండో రోజు 40 లక్షల రూపాయలు, మూడో రోజు 40 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 1.57 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా ఇప్పటి వరకు 2.3 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
ఇక ఈ సినిమా నాలుగో రోజున కూడా స్టడీగా కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది. ఈ చిత్రం తొలి సోమవారం రోజున సుమారుగా 20 లక్షల రూపాయలు వసూలు చేయవచ్చు. ఓవర్సీస్‌తో కలిపి మరో 30 లక్షల వరకు కలెక్షన్లు రాబట్టే ఛాన్స్ ఉంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











