OMG 2 Collections 100 కోట్లు కొల్లగొట్టిన ఓ మై గాడ్ 2.. అక్షయ్ కుమార్ మూవీ లాభాల్లోకి రావాలంటే?
బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన ఓ మై గాడ్ (OMG 2) చిత్రం భారీ కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నది. గదర్ 2 సినిమా నుంచి వస్తున్న పోటీని తట్టుకొని నిలకడగా వసూళ్లను సాధిస్తున్నది. అమిత్ రాయ్ దర్శకత్వంలో అరుణా భాటియా, విపుల్ షా రూపొందించిన ఈ చిత్రం పంద్రాగస్టు కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యామీ గౌతమ్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఆగస్టు 11వ తేదీన రిలీజైంది. ఈ సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
గతంలో బాక్సాఫీస్ వద్ద కాసుల పంట పండించిన ఓ మైగాడ్ చిత్రానికి సీక్వెల్‌గా ఓ మై గాడ్ 2 రూపొందింది. సెక్స్ ఎడ్యుకేషన్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందిన ఈ సినిమాను సుమారు 150 కోట్ల రూపాయలతో తెరకెక్కించారు. ఈ చిత్రానికి మంచి బజ్ క్రియేట్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా 1500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. తొలి ఆట తర్వాత ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకొన్నది.

గత వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న అక్షయ్ కుమార్‌కు ఓ మై గాడ్ (OMG 2) చిత్రం ఊరట కలిగించిందనే చెప్పాలి. ఈ సినిమా తొలి రోజు 10.26 కోట్ల రూపాయలను, రెండో రోజు ఈ సినిమా 15.5 కోట్ల రూపాయలు, మూడో రోజు ఈ సినిమా 17.5 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 12 కోట్ల రూపాయలు, 5వ రోజు 17 కోట్ల రూపాయలు, ఆరో రోజు 7 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 100 కోట్ల రూపాయల కలెక్షన్లకు చేరువైంది.
ఇక ఓ మై గాడ్ (OMG 2) చిత్రం 7వ రోజు కూడా నిలకడగా కలెక్షన్లను రాబడుతున్నది. వారం రోజులుగా ఎలాంటి తడబాటు లేకుండా వసూళ్లను సాధించింది. ఈ సినిమా 7వ రోజు ఆక్యుపెన్సీ ఓ మోస్తారుగా కనిపించింది. ఓవరాల్‌గా ఈ చిత్రం 40 శాతం ఆక్యుపెన్సీని రాబట్టింది. 7వ రోజు ఈ సినిమా సుమారు 6 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది. ఇక 7 రోజుల్లో ఈ చిత్రం ఇండియాలో 85 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
ఇక ఓ మై గాడ్ (OMG 2) చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇండియాలో 100 కోట్ల మైలురాయిని దాటేందుకు ప్రయత్నిస్తున్నది. ఇప్పటికే ఈ సినిమా 85 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో ఈ చిత్రం 25 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా 110 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ఓ మై గాడ్ (OMG 2) చిత్రం బ్రేక్ ఈవెన్ వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా ముందు భారీ లక్ష్యమే కనిపిస్తున్నది. ఈ సినిమా లాభాల్లోకి ప్రవేశించాలంటే.. కనీసం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 160 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ సినిమా 110 కోట్లకుపైగా వసూలు చేసింది కనుక.. రెండో వారంలో ఈ సినిమా లాభాల్లోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది.


Click it and Unblock the Notifications











