మరోసారి KGF 2 సంచలనం.. అరుదైన రికార్డ్ బ్లాస్ట్ అయ్యిందిగా..
కన్నడ బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ KGF 2 ఎలాంటి రికార్డులను క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా ఊహించినట్లుగానే అతి పెద్ద సినిమాల రికార్డులను కూడా చాలా ఈజీగా బ్రేక్ చేస్తూ ఉండడం విశేషం. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ఈ సినిమా ఇండస్ట్రీలో కూడా ఎవరూ ఊహించని విధంగా కలెక్షన్స్ అందుకుంది. కేజిఎఫ్ నిర్మాతలకు ఈ సినిమా పెట్టిన పెట్టుబడికి భారీస్థాయిలో కాసుల వర్షం కురిపించింది అనే చెప్పాలి.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా నటించిన ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్లకు పైగా వసూళ్లను సొంతం చేసుకుంది. కేవలం హిందీ మార్కెట్ లోనే ఈ సినిమాకు నాలుగు వందల కోట్లకు పైగా కలెక్షన్స్ రావడం ఆశ్చర్యాన్ని కలుగ చేసింది. బాలీవుడ్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సౌత్ మూవీ గా కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది.

అయితే రీసెంట్ గా రాఖీ బాయ్ ఖాతాలో మరో సరికొత్త రికార్డు కూడా నమోదు అయినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా బాహుబలి2 రికార్డును కూడా బ్రేక్ చేయడం విశేషం. ఇప్పటి వరకు భారతదేశంలో అత్యధిక జనాలు థియేటర్ లో చూసిన సినిమాలలో KGF 2 మొదటి స్థానంలో నిలిచింది. ఇంతకుముందు ఈ రికార్డు బాహుబలి2 పేరిట ఉండేది. ఇక ఇప్పుడు ఎక్కువమంది చూసిన ఇండియన్ సినిమాల్లో KGF 2 నిలవడం విశేషం.
ఇక బుక్ మై షోలో లో కూడా కేజిఎఫ్ చాప్టర్ 2 మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు విడుదలైన పాన్ ఇండియన్ సినిమాలలో KGF 2కి బుక్ మై షో లో ఎక్కువ టిక్కెట్లు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఆ లిస్ట్ లో మొదటి స్థానంలో నిలిచి బాహుబలి రికార్డును బ్రేక్ చేసింది. ఇంతకుముందు బాహుబలి 2 నెంబర్ వన్ స్థానంలో కొనసాగింది. బుక్ మై షో లో KGF 2 చిత్రంకు 17.1 మిలియన్ టికెట్ల అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. ఇంతకుముందు బాహుబలి 2 పేరిట 17 మిలియన్ల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఈ విధంగా KGF 2, బాహుబలి2 రికార్డులను బ్రేక్ చేస్తూ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications











