twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    '1 నేనొక్కడినే' స్పెషల్ ఛారిటీ షో డిటేల్స్

    By Srikanya
    |

    హైదరాబాద్ : మహేష్‌ ఈసారి '1, నేనొక్కడినే' అంటూ సంక్రాంతి సంబరాలు చేయటానికి వస్తున్నాడు. రేపు(జనవరి 10)న విడుదల అవుతున్న ఈ చిత్రం నిర్మాతలు ఛారిటీ షో ని వేస్తున్నారు. హైదరాబాద్ కుకట్ పల్లి మల్లికార్జున థియోటర్ లో.. సూపర్ స్టార్ అభిమానుల కోసం ఈ షో ను వేస్తున్నారు. ఉదయం ఆరు గంటలకు ఈ షో పడనుంది. ఈ షో కి టిక్కెట్ రేట్లు ఎక్కువగానే ఉంటాయి. ఈ షో ద్వారా వచ్చే మొత్తాన్ని చిల్డ్రన్ పౌండేషన్ కి డొనేట్ చేయనున్నారు. గతంలో అత్తారింటికి దారేది చిత్రం కు ఇదే థియోటర్ లో ఛారెటీ షో వేసి ఓ పేద ముస్లిం అమ్మాయి వివాహానికి డొనేట్ చేసారు.

    '1, నేనొక్కడినే' కనీ వినీ ఎరుగని రీతిలో రికార్డు స్థాయిలో దాదాపు 1450థియేటర్లలో రిలీజవుతోంది. ఒక్క ఆంధ్ర ప్రదేశ్‌లోనే ఈ సినిమాని దాదాపు 1200 థియేటర్లలో రిలీజ్‌ చేస్తున్నారు. ఓవర్సీస్‌లో 250థియే టర్లలో రిలీజవుతున్న చిత్రమిదే. ఏ ఇతర సినిమాతో పోల్చినా ఇదో రికార్డ్‌. ఇంతవరకూ సుమారు వెయ్యి థియేటర్లలో మాత్రమే సినిమాలు రిలీజయ్యేవి. వన్‌ ఆ రికార్డులను తుడిచేసింది.

    One Nenokkadine Special Charity Show

    రిలీజైన తొలివారంలోనే సినిమాకి ఖర్చు చేసిన రూ.72కోట్లను లాగేయాలనేది నిర్మాతల ఆలోచన. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో రిలీజవుతుండడం ఇంకో రికార్డ్‌. ముఖ్యంగా కొరియా, దక్షిణాఫ్రికా, ఫ్రాన్స్‌, జపాన్‌, రష్యా తదితర చోట్ల అక్కడి స్థానిక భాషల్లో రిలీజవుతుండడం పెద్ద సెన్సేషన్‌. ఆయా ప్రాంతీయ భాషల్లో సబ్‌ టైటిల్స్‌తో సినిమా వేయనున్నామని నిర్మాతలు తెలిపారు. అలాగే ఈ చిత్రాన్ని లండన్‌, ఉత్తర అమెరికా పరిసరాలు సహా జపాన్‌లోనూ చిత్రీకరించారు.

    గౌతమ్‌ కృష్ణ సైతం తన డబ్బింగ్‌ని ఒకే టేక్‌లో చెప్పేయడం విశేషం. కథనం సీరియస్‌గా సాగుతున్నా, వినోదం పాళ్లు తగ్గకుండా ఉండే చిత్రమిది. తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే చిత్రమిదన్న నమ్మకం ఉంది. వంద కోట్ల వసూళ్లు సాధించి ప్రపంచానికి తెలుగు సినిమా గొప్పతనాన్ని ఆవిష్కరిస్తుంది. మహేష్‌ కెరీర్‌లోనే మైలురాయి అవుతుంది. సుకుమార్‌ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు . ఈ నెల 10వ తేదీన రిలీజ్‌ కానున్న ఈ చిత్రానికి సెన్సార్‌ యుఎ సర్టిఫికెట్‌ వచ్చింది. బ్యానరు: 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌.

    English summary
    "1 Nenokkadine" special charity show will be held at Mallikarjuna Theater, Kukatpally, Hyderabad for Super Star Fans. This will be the earliest show in Hyderabad and is supposed to start at 6:00 AM. The ticket prices are supposed to be in four digits and the funds collected will be donated to a Children Foundation.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X