‘1’ నేనొక్కడినే UK ప్రీమియర్ షో రిపోర్ట్
హైదరాబాద్: మాకు అందిన సమచారం ప్రకారం కొద్ది సేపటి క్రితమే UK ప్రీమియర్ షోలు పూర్తయ్యాయి. మహేష్ అభిమానులతో ఇక్కడ థియోటర్స్ నిండిపోయాయి. హాలీవుడ్ చిత్రం ఇంపాక్ట్ ఇచ్చే స్టాండర్డ్స్ తో సుకుమార్ చిత్రం తీసాడని అంటున్నారు. సాంకేతికంగా చూస్తే తెలుగు సినిమాని ఓ స్ధాయికి తీసుకు వెళ్ళిన సినిమానే అని మెచ్చుకుంటున్నారు. అయితే సినిమా తమ అంచనాలను అందుకోలేకపోయిందని చెప్తున్నారు. వారు ఇచ్చే రిపోర్ట్ ఇలా ఉంది...
సినిమా ఓ రివేంజ్ డ్రామా. అయితే కొత్త ఫార్మెట్ లో చెప్పడానికి ప్రయత్నించాడు. ఈ చిత్రం బేసిక్ ప్లాట్ ...జూ.మహేష్(గౌతమ్) తల్లి,తండ్రులు సినిమా ప్రారంభంలోనే చంపబడతారు. ఆ కిల్లర్స్ ఎలా ట్రాక్ చేసాడన్న విషయం చుట్టూ కథ తిరుగుతుంది.

సినిమా రెగ్యలర్ తెలుగు ఫార్మెట్ లో అసలు లేదు. కమర్షియల్ విలువలు అని చెప్పబడే ఎట్రాక్షన్స్ చాలా చాలా తక్కువ ఉన్నాయి. హాలీవుడ్ సినిమాల స్ధాయిలో పట్టున్న స్క్రీన్ ప్లే తో సినిమా ఫస్టాఫ్...చాలా వేగంగా చక్కగా సాగిపోయింది.
సెకండాఫ్ పూర్తిగా ఆపోజిట్ గా ఉంది. సినిమా చాలా చాలా స్లో పేస్ లో నడవటం మొదలైంది. ఫస్టాఫ్ లో ఉన్నంత ఊపు ఇక్కడ కనపడలేదు. దర్శకుడు సినిమాకు ప్రాణమైన ఈ పార్ట్ ని మరింత బాగా డీల్ చేసే ఉంటే బాగుండేది. అలాగే సినిమాలో గ్రాఫిక్స్ చాలా పూర్ గా ఉన్నాయి.
గమనిక: పై వివరాలు కేవలం మాకు ఆన్ లైన్ ద్వారా ఫాఠకుల ద్వారా అందిన వివరాలు మాత్రమే... ఇందులో నిజా నిజాలు...రివ్యూతో మీకు మరి కొద్ది సేపట్లో అందిస్తాము.


Click it and Unblock the Notifications











