రామ్ ‘ఒంగోలు గిత్త’ బిజినెస్ పొజీషన్

By Srikanya

హైదరాబాద్ : రామ్, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఒంగోలు గిత్త'. ఈ చిత్రం పిబ్రవరిలో విడుదలకు రెడీ అవుతోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం బిజినెస్ ప్రారంభమైంది. అందిన తాజా సమాచారం ప్రకారం నెల్లూరు జిల్లా రైట్స్ ని గాయిత్రీ ఫిల్మ్స్ కి చెందిన నరేంద్ర రెడ్డి సొంతం చేసుకున్నారు. ఈ మేరకు 72 లక్షలు చెల్లించినట్లు సమాచారం. అళాగే మిగతా ఏరియాల నుంచి కూడా మంచి ఫ్యాన్సీ ఆఫర్స్ వస్తున్నట్లు యూనిట్ వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఈ చిత్రం గురించి దర్శకుడు భాస్కర్ మాట్లాడుతూ... 'మిర్చీ యార్డ్ నేపథ్యంలో సాగే మాస్ ఎంటర్‌టైనర్ 'ఒంగోలు గిత్త'. ఇందులో రామ్ పాత్ర చిత్రణ కొత్త తరహాలో ఉంటుంది. నా గత చిత్రాల తరహాలో సున్నితమైన భావోద్వేగాలుంటూనే మాస్ ప్రేక్షకులని ఆకట్టుకునే సినిమా ఇది. మిర్చి యార్డుకు రామ్ పాత్రకు ఉన్న సంబంధం ఏమిటనేది తెరపైన చూడాల్సిందే' అన్నారు . శ్రీవెంక సినీ చిత్ర పతాకంపై ఈ చిత్రాన్ని బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. కృతికర్బందా హీరోయిన్ గా నటిస్తోంది. షూటింగ్ పూర్తయింది.

నిర్మాత మాట్లాడుతూ....ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో ఆడియోను, ఫిబ్రవరిలో చిత్రాన్ని విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాం. చక్కని కుటుంబకథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటుందన్న నమ్మకముంది. బొమ్మరిల్లు, పరుగు లాంటి కుటుంబకథా చిత్రాల తర్వాత ఆ స్థాయిలో భాస్కర్ తెరకెక్కిస్తున్న చిత్రమిది. రామ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఎనర్జిటిక్‌గా వుంటుంది అన్నారు.

సమర్పకుడు బాపినీడు మాట్లాడుతూ... ప్యామిలీ టచ్ తో కూడిన మంచి మాస్ ఎంటర్ టైనర్ గా చిత్రం రూపొందుతోంది. జనవరిలో సినిమా విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాం. బొమ్మరిల్లు, పరుగులాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ ని రూపొందించిన భాస్కర్ తీస్తున్న ఫ్యామిలీ టచ్ తో ఉండే మంచి మాస్ ఎంటర్ టైనర్ ఇది. రామ్ ఇమేజ్ కి తగినట్లుగా ఎనర్జిటిక్ గా ఉంటూ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉంటాయి. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఈ సినిమాకి హైలెట్ గా ఉంటుంది. మార్కెట్ యార్డు నేపథ్యంలో ఈ కథ జరుగుతుందని వెల్లడించారు.

రామ్, కృతి కర్బందా, ప్రకాష్ రాజ్, అభిమన్యు సింగ్, డా. బ్రహ్మానందం, ఆహుతి ప్రసాద్, అజయ్, రఘుబాబు, రమాప్రభ ముఖ్య పాత్రలు చేషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, ఫైట్స్: సెల్వ, ఫోటోగ్రఫీ: వెంకటేష్, ఆర్ట్: కె. కదిర్, పాటలు: వనమాలి, ప్రొడక్షన్ కంట్రోలర్: పి. రామ్ మోహన్ రావు, సమర్పణ: భోగవల్లి బాపినీడు, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్, కథ-స్ర్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: భాస్కర్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X