Ooru Peru Bhairavakona Collections సందీప్ కిషన్ మూవీకి ఊహించని కలెక్షన్లు.. ఎన్ని కోట్ల వసూళ్లంటే?
యువ హీరో, హీరోయిన్లు సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ నటించిన ఫాంటసీ, సస్పెన్స్ థ్రిల్లర్ ఊరు పేరు భైరవకోన. క్రియేటివ్ డైరెక్టర్ వీఐ ఆనంద్ దర్శకత్వంలో రాజేశ్ దండా, అనిల్ సుంకర సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాపై క్రేజ్ ఉండటంతో రెండు రోజుల ముందే ప్రదర్శించిన పెయిడ్ ప్రీమియర్లకు భారీ స్పందన లభించింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 16వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? కలెక్షన్లు ఎలా ఉన్నాయి? అనే వివరాల్లోకి వెళితే..
ఫాంటసీ, సస్పెన్స్, థ్రిల్లర్ జోనర్‌ను మిక్స్ చేసి ఓ డిఫరెంట్ వరల్డ్ క్రియేట్ చేసిన దర్శకుడు వీఐ ఆనంద్ ఈ సినిమాకు అత్యున్నత సాంకేతికను అందించారు. నటీనటుల రెమ్యునరేషన్లు, సాంకేతిక నిపుణల పారితోషికం, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను సుమారుగా 25 కోట్ల రూపాయలతో నిర్మించారు.

ఊరు పేరు భైరవకోన టీజర్, ట్రైలర్ రిలీజ్ తర్వాత మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమాపై అంచనాలు పెరగడంతో బిజినెస్ కూడా భారీగానే జరిగింది. ఈ సినిమా నైజాంలో 3 కోట్ల మేర బిజినెస్ చేస్తే.. ఏపీలో 6 కోట్ల రూపాయలు, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 1 కోటి రూపాయలు, ఓవర్సీస్‌లో ఒక కోటి రూపాయల బిజినెస్ నమోదు చేసింది. ఈ సినిమా సుమారుగా 11 కోట్ల మేర బిజినెస్ చేసింది.
ఊరు పేరు భైరవకోన సినిమాకు డిమాండ్ ఉండటంతో ఈ మూవీ స్థాయికి మించి స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఏపీ, నైజాంలో 600 స్క్రీన్లు, ప్రపంచవ్యాప్తంగా 900 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా సుమారుగా 12 కోట్ల రూపాయల షేర్, 24 కోట్ల గ్రాస్ టార్గెట్‌గా బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.

ఊరు పేరు భైరవకోన సినిమా పెయిడ్ ప్రీమియర్లకు వచ్చిన మిక్స్‌డ్ టాక్‌తో డీసెంట్ ఓపెనింగ్స్ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా సుమారుగా 45 శాతం ఒపెనింగ్స్ సాధించింది. దాంతో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 3 కోట్ల నికరంగా, 5 కోట్లు గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 6.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











