Ooru Peru Bhairavakona Collections ఊరు పేరు భైరవకోన భారీ కలెక్షన్లు.. ఎన్ని కోట్లంటే?

యువ హీరో సందీప్ కిషన్, క్రియేటివ్ డైరెక్టర్ వీఐ ఆనంద్ కాంబినేషన్‌లో రూపొందిన ఊరు పేరు భైరవకోన చిత్రం భారీ అంచనాలతో రిలీజ్‌కు సిద్దమైంది. హాస్య మూవీస్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర, రాజేశ్ దండ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ఫిబ్రవరి 16వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ట్రైలర్లు, ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి స్పందన రావడంతో హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో పెయిడ్ ప్రీమియర్లు ప్రదర్శించారు. ఈ సినిమా బడ్జెట్, పెయిడ్ ప్రీమియర్ల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

జోంబి తరహా యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో ఊరు పేరు భైరవకోన సినిమాను రూపొందించారు. ఈ చిత్రంలో సందీప్ కిషన్‌తోపాటు వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్, వెన్నెల కిషోర్, హర్ష చెముడు, పీ రవిశంకర్ తదితరులు నటించిన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమాలో నటులు, సాంకేతిక నిపుణులు రెమ్యునరేషన్‌తోపాటు ప్రమోషనల్‌ ఖర్చులతో సహా ఈ మూవీని 25 కోట్ల రూపాయలతో నిర్మించారు.

Ooru Peru Bhairavakona Premiere Shows Collections Worldwide

ఊరు పేరు భైరవ కోన సినిమాకు మంచి బజ్ రావడంతో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 1100 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఏపీ, నైజాంలో 550 స్క్రీన్లు, ఇతర రాష్ట్రాల్లో 150 స్క్రీన్లు, ఓవర్సీస్‌లో సుమారుగా 400 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. దాంతో ఈ చిత్రం రికార్డు స్థాయి స్క్రీన్లలో రిలీజ్ కావడం విశేషంగా మారింది.

ఊరు పేరు భైరవకోన సినిమాకు క్రేజ్ పెరగడంతో ఈ మూవీని రెండు రోజుల ముందే పెయిడ్ ప్రీమియర్లు ప్రదర్శించారు. ఈ సినిమా హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో ప్రీమియర్లు ఏర్పాటు చేశారు. ప్రీమియర్లకు భారీ స్పందన రావడంతో హౌస్‌పుల్స్‌గా మారాయి. ప్రీమియర్ల అనంతరం పాజిటివ్ రావడంతో టీమ్ తాజాగా సక్సెస్ మీట్‌ను ముందుగానే నిర్వహించింది.

ఊరు పేరు భైరవకోన సినిమా పెయిడ్ ప్రీమియర్ల ద్వారా రికార్డు స్థాయిలో వసూళ్లు నమోదు అయ్యాయి. ఈ సినిమా ప్రీమియర్ల ద్వారా 1.1 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది. ఇటీవల కాలంలో ప్రీమియర్ల ద్వారా ఈ రేంజ్ కలెక్షన్లు రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.

Ooru Peru Bhairavakona Premiere Shows Collections Worldwide

ప్రీమియర్లు అందించిన జోష్‌తో ఊరు పేరు భైరవకోన చిత్రం ఫిబ్రవరి 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమాకు భారీ ఓపెన్సింగ్ లభించే అవకాశం ఉంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ కలెక్షన్లు వస్తాయో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X