Oosaravelli Re Release Collections: ఊసరవెళ్లి రీ రిలీజ్ కలెక్షన్లు? ఎన్టీఆర్ మూవీ బాక్సాఫీస్ పరిస్థితి ఏమిటి?

యంగ్ టైగర్ నందమూరి తారక రామారావు (NTR) నటించిన ఊసరవెళ్లి చిత్రాన్ని రీ రిలీజ్ చేశారు. యంగ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 2011 సంవత్సరంలో రూపొందిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకొన్నది. ఈ చిత్రంలో తమన్నా భాటియా, ప్రకాశ్ రాజ్, విద్యుత్ జమ్వాల్, తనికెళ్ల భరణి, సాయాజీ షిండే, మురళీ శర్మ, పాయల్ ఘోష్, షామ్, రహ్మన్, రఘుబాబు, బెనర్జీ, ప్రభాస్ శ్రీను, రఘు కారుమంచి, వేణు మాధవ్, ఎంఎస్ నారాయణ, ఆహుతి ప్రసాద్ తదితరులు నటించారు.

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా రూపొందించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌: రసూల్ ఎల్లోర్, మ్యూజిక్: దేవీ శ్రీ ప్రసాద్, ఎడిటింగ్: గౌతమ్ రాజు తమ బాధ్యతలను నిర్వర్తించారు. విజయ దశమి కానుకగా ఈ సినిమా 2011 అక్టోబర్ 6వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమాను ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా మే 20వ తేదీన రీ రిలీజ్ చేశారు. రీ రిలీజ్ సందర్భంగా ఈ మూవీ వసూలు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

Oosaravelli Re Release Box Office

కాశ్మీర్‌లో బస్సు ప్రయాణం సందర్భంగా టెర్రిరిస్టులు జరిపిన దాడి నుంచి టోని (ఎన్టీఆర్), నిహారిక (తమన్నా భాటియా) తప్పించుకొంటారు. ఆ సమయంలో నిహారికపై టోని ప్రేమను పెంచుకొంటారు. టోని ప్రేమిస్తున్నాడనే విషయం తెలుసుకోకుండా నిహారిక హైదరాబాద్‌కు వెళ్తుంది. అయితే నిహారికను వెతుక్కొంటూ వెళ్లిన టోని.. తన ప్రేమ గురించి చెబితే.. తాను మంత్రి కుమారుడు రాకేష్ (అద్విక్ మహాజన్) అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నానని చెబుతుంది. దాంతో రాకేష్‌తో టోని తన లవ్ స్టోరిని చర్చిస్తాడు.కానీ తనను నిహారిక పెళ్లి చేసుకోకుండా ఉండే.. ఆమెను చంపేస్తానని రాకేష్ బెదిరిస్తాడు. ఈ క్రమంలో టోనిపై నిహారిక లవ్ పడుతుంది. దాంతో దుబాయ్‌కి చెందిన డాన్ అజ్జు భాయ్ (ప్రకాశ్ రాజ్) తమముడు ఇర్ఫాన్ భాయ్‌ (విద్యుత్ జమ్వాల్) తో కలిసి రాకేష్.. టోనిని కిడ్నాప్ చేస్తాడు. అయితే అజ్జు భాయ్ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు? టోని అసలు ప్రొఫెషన్ ఏమిటి? టోని ప్రొఫెషన్ తెలుసుకొన్న నిహారిక పరిస్థితి ఏమిటి? టోని, నిహారిక మధ్య చోటు చేసుకొన్న సంఘటనలు ఏమిటి? అజ్జు భాయ్‌ కుట్రలను టోని ఎలా అడ్డుకొన్నాడు? అనే ప్రశ్నలకు సమాధానమే ఊసరవెళ్లి సినిమా కథ.

Also Read
Karuppu Day 9 Collection: బాక్సాఫీస్‌పై కరుప్పు దండయాత్ర.. సూర్య మూవీకి ఎన్ని కోట్లంటే?
Karuppu Day 9 Collection: బాక్సాఫీస్‌పై కరుప్పు దండయాత్ర.. సూర్య మూవీకి ఎన్ని కోట్లంటే?

ఇంటర్నేషన్ మాఫియా నేపథ్యంతో లవ్ స్టోరిగా రూపొందిన ఈ సినిమాను సుమారుగా 25 కోట్ల రూపాయలతో బీవీఎస్ఎన్ ప్రసాద్ రిచ్‌గా నిర్మించారు. బాక్సాఫీస్, ట్రేడ్ వర్గాల రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా అప్పట్లో 57 నుంచి 60 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్‌లో మంచి వసూళ్లు చేసిన చిత్రంగా ఘనతను సాధించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Recommended For You
100 కోట్లకు చేరువగా దృశ్యం 3.. మోహన్‌లాల్ మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
100 కోట్లకు చేరువగా దృశ్యం 3.. మోహన్‌లాల్ మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

మే 20వ తేదీ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా రిలీజైన ఈ చిత్రం ప్రీమియర్లను తెలంగాణ, ఏపీలోని ముఖ్య పట్టణాల్లోను, బెంగళూరు, చెన్నైలో ప్రదర్శించారు.ఈ చిత్రం ప్రీమియర్ షోల ద్వారా 10 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఇక 20వ తేదీన 1.25 కోట్ల రూపాయలు, 21వ తేదీన 12.5 లక్షల రూపాయలు, 22వ తేదీన ఈ చిత్రం 5 లక్షల రూపాయలు వసూలు చేసింది. 23వ తేదీన 5 లక్షల రూపాయలు రాబబట్టే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

You May Also Like
'త్రిష రాజకీయాల్లోకి రావాలి.. జయలలితతో ఆమెకు అలాంటి కనెక్షన్’
'త్రిష రాజకీయాల్లోకి రావాలి.. జయలలితతో ఆమెకు అలాంటి కనెక్షన్’

గత 4 రోజుల్లో ఈ చిత్రం 1.5 కోట్ల మేర కలెక్షన్లు సాధించింది. ఈ చిత్రం ఫస్ట్ టైమ్ థియేట్రికల్ రన్‌లో 60 మేర వసూళ్లను సాధించింది. రీ రిలీజ్ కలెక్షన్లతో కలిపి ఈ చిత్రం ఫైనల్‌గా 62 కోట్ల రూపాయల మేర వసూళ్లను సాధించే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X