దుర్యోధన ఆపరేషన్ ఫ్లాప్

గత ఏడాది "ఆపరేషన్ దుర్యోధన" వంటి హిట్ చిత్రాన్ని అందించిన పోసాని కృష్ణ మురళి తాజా చిత్రం "ఆపద మొక్కులవాడు" ఇటీవల వివాదాస్పదమైంది. ఈ సినిమా విడుదలలో జాప్యానికి దాసరికి చెందిన సిరి మీడియా కారణమని పోసాని తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.స్క్రిప్టు సరిగా పండని కారణంగా సినిమా ప్రేక్షకుల ఆదరణను చవి చూడలేకపోతోంది.
ఈ వారం విడుదలైన మరో చిన్న సినిమా "వాలెంటైన్" వైపు కూడా ప్రేక్షకులు అంతగా దృష్టి సారించడం లేదు. రాజేంద్రప్రసాద్ నటించిన సోకాల్డ్ "ప్రతిష్టాత్మక చిత్రం" "మీ శ్రేయోభిలాషి" కలెక్షన్లు కూడా అంతంత మాత్రంగా ఉన్నాయి. నాగార్జున "డాన్" కలక్షన్లు మూడో వారంలో బాగా క్షీణించాయి


Click it and Unblock the Notifications











