Operation Valentine Closing Collections ఆపరేషన్ వాలెంటైన్‌ హిట్టా? ఫట్టా? వరుణ్ తేజ్ మూవీకి ఎన్ని కోట్లంటే?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మనుషీ చిల్లర్ జంటగా నటించిన తాజా చిత్రం ఆపరేషన్ వాలంటైన్ బాక్సాఫీస్ వద్ద థియేట్రికల్ రన్ ముగించేసింది. భారీ అంచనాలతో హిందీ, తెలుగులో రిలీజైన ఈ సినిమాకు శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సోని పిక్చర్స్ బ్యానర్‌పై సందీప్ మడ్డా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా థియేట్రికల్ రన్‌లో ఏ మేరకు వసూళ్లను సాధించింది? ఈ సినిమా బాక్సాఫీస్ పరంగా హిట్టా? ఫట్టా? అనే వివరాల్లోకి వెళితే..

ఆపరేషన్ వాలెంటైన్ సినిమా కథ విషయానికి వస్తే.. జమ్ము, కశ్మీర్‌లో పాక్ ఉగ్రవాదులు పుల్వామా దాడి అనంతరం భారత సైన్యం చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్ బ్యాక్ డ్రాప్‌గా ఈ సినిమాను రూపొందించారు. నవదీప్, రుహానీ శర్మ,మీర్ సర్వర్, శుభశ్రీ, లహరి షారీ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను సుమాుగా 45 కోట్ల రూపాయలతో నిర్మించారు.

Operation Valentine Closing Collections worldwide Varun Tej s movie final box Office Report

వరుణ్ తేజ్ సినిమాకు థియేట్రికల్‌కు సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. నైజాంలో 6 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 2 కోట్ల రూపాయలు, ఆంధ్రాలో 9 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. నైజాం, ఆంధ్రాలో కలిపి ఈ సినిమా 17 కోట్ల రూపాయల మేర బిజినెస్ చేసింది. ఇక కర్ణాటకలో 2 కోట్లు, ఓవర్సీస్‌లో కోటి రూపాయలు బిజినెస్‌తో కలిపి మొత్తంగా 20 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

సుమారుగా 21 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమాను ఏపీ, తెలంగాణలో 600 స్క్రీన్లు, ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల్లో కలిపి 300 స్క్రీన్లు, ఓవర్సీస్‌లో 240 స్క్రీన్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను సుమారుగా 1200 స్క్రీన్లలో విడుదల చేశారు.

Operation Valentine Closing Collections worldwide Varun Tej s movie final box Office Report

ఆపరేషన్ వాలెంటైన్ సినిమా తొలి రోజు 1.2 కోట్ల నికర వసూళ్లతో వసూళ్ల యాత్రను మొదలుపెట్టింది. రెండో రోజు 1.5 కోట్లు, మూడో రోజు 1.45 కోట్లు, 4వ రోజు 80 లక్షలు, 5వ రోజు 80 లక్షలు, 6వ రోజు 70 లక్షల రూపాయలు, 7వ రోజు 65 లక్షల రూపాయలు, 8వ రోజు 20 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా సుమారుగా 7 కోట్ల నికర కలెక్షన్లు, 12 కోట్ల గ్రాస్ వసూళ్లను తెలుగు రాష్ట్రాల్లో నమోదు చేసింది.

ఇక హిందీ వెర్షన్ కలెక్షన్ల విషయానికి వస్తే.. తొలి రోజు 30 లక్షల రూపాయలు నికరంగా, రెండో రోజు 50 లక్షలు, మూడో రోజు 50 లక్షలు, 4వ రోజు 20 లక్షలు, 6వ రోజు 20 లక్షలు, 7వ రోజు 15 లక్షలు, 8వ రోజు 10 లక్షల రూపాయలు వసూలు చేసింది. వరుణ్ తేజ్ బాలీవుడ్ ఎంట్రీ మూవీ కేవలం 2 కోట్ల రూపాయల వసూళ్లను మాత్రమే నమోదు చేసింది.

Operation Valentine Closing Collections worldwide Varun Tej s movie final box Office Report

ప్రపంచవ్యాప్తంగా ఆపరేషన్ వాలెంటైన్ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 12 కోట్ల గ్రాస్, హిందీ వెర్షన్ 3 కోట్ల గ్రాస్, ఓవర్సీస్‌లో 2 కోట్ల గ్రాస్ వసూళ్లతో మొత్తంగా 17 కోట్ల గ్రాస్ వసూళ్లను 8.5 షేర్ వసూలు చేసింది. దాంతో ఈ సినిమా థియేట్రికల్‌గా 13 కోట్ల మేర నష్టాలతో ముగిసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X