Operation Valentine Day 2 Collection బాక్సాఫీస్ వద్ద స్టడీగా వరుణ్ తేజ్ మూవీ.. ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సోని పిక్చర్స్ బ్యానర్‌పై సందీప్ మడ్డా నిర్మించిన యాక్షన్, థ్రిల్లర్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్. ఈ చిత్రంలో మెగా హీరో వరుణ్ తేజ్, మిస్ ఇండియా మనుషీ చిల్లర్ జంటగా నటించారు. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాలో నవదీప్, రుహానీ శర్మ, శుభశ్రీ, లహరి షారీ తదితరులు నటించారు. ఈ సినిమా 2 రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
పాకిస్థాన్ మిలిటెంట్లు జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా దాడి ఘటన భారతీయుల ఆగ్రహానికి గురిచేసింది. ముష్కరుల దాడి తర్వాత ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంగా తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 1వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ సంపాదించుకొన్నది.

ఇక ఆపరేషన్ వాలెంటైన్ మూవీని సుమారుగా 45 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌ను 20 కోట్లుగా వాల్యూ కట్టారు. ఈ సినిమాను ఏపీ, తెలంగాణలో 600 స్క్రీన్లు, ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల్లో కలిపి 300 స్క్రీన్లు, ఓవర్సీస్‌లో 240 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. దాంతో ఈ సినిమాను సుమారుగా 1200 స్క్రీన్లలో విడుదల చేశారు.
ఆపరేషన్ వాలెంటైన్ చిత్రం తొలి రోజు భారీగా కలెక్షన్లను నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 3.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 2 కోట్లకుపైగా వసూళ్లను, ఓవర్సీస్‌లో 1 కోటి రూపాయల మేర వసూళ్లను సాధించింది. వరుణ్ తేజ్ కెరీర్‌లో బెస్ట్ కలెక్షన్లలో ఒకటిగా నిలిచింది.

ఇదిలా ఉండగా, ఈ సినిమా 2 రోజు కూడా నిలకడగా బాక్సాఫీస్ వద్ద కనిపించింది. ఈ సినిమా 2వ రోజు 2 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా 5.5 కోట్ల రూపాయల మేర వసూళ్లు నమోదు చేసే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా? లేదా? అనేది వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











