Operation Valentine Collections వరుణ్ తేజ్ మూవీకి భారీ కలెక్షన్లు.. లాభాల్లోకి రావాలంటే ఎంత వసూలు చేయాలంటే?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మాజీ మిస్ ఇండియా మనుషీ చిల్లర్ జంటగా సోని పిక్చర్స్, సందీప్ మడ్డా సంయుక్తంగా నిర్మించిన చిత్రం ఆపరేషన్ వాలెంటైన్. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాలో నవదీప్, రుహానీ శర్మ,మీర్ సర్వర్, శుభశ్రీ, లహరి షారీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. పాక్ ముష్కరుల పుల్వామా దాడి అనంతరం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంగా తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 1వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బాక్సాఫీస్ వద్ద నమోదైన కలెక్షన్లు ఎంత అనే వివరాల్లోకి వెళితే...

ఆర్మీ బ్యాక్ డ్రాప్‌ సినిమా కావడం వల్ల రియల్ లోకేషన్లు, కశ్మీర్ తదితర ప్రాంతాల్లో ఆపరేషన్ వాలెంటైన్ సినిమాను నిర్మించడం వల్ల భారీగా ఖర్చు అయింది. హిందీ, తెలుగు భాషల్లో రూపొందిన ఈ సినిమాలో నటించిన యాక్టర్లు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను సుమారుగా 45 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు.

Operation Valentine Expected Box Office Collections worldwide

ఆపరేషన్ వాలెంటైన్ సినిమాకు మంచి బజ్ రావడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా క్రేజీగా జరిగింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. నైజాంలో 6 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 2 కోట్ల రూపాయలు, ఆంధ్రాలో 9 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. నైజాం, ఆంధ్రాలో కలిపి ఈ సినిమా 17 కోట్ల రూపాయల మేర బిజినెస్ చేసింది. ఇక కర్ణాటకలో 2 కోట్లు, ఓవర్సీస్‌లో కోటి రూపాయలు బిజినెస్‌తో కలిపి మొత్తంగా 20 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ప్రమోషన్స్‌కు దేశవ్యాప్తంగా ఆదరణ లభించడంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ సినిమాను ఏపీ, తెలంగాణలో 600 స్క్రీన్లు, ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల్లో కలిపి 300 స్క్రీన్లు, ఓవర్సీస్‌లో 240 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. దాంతో ఈ సినిమాను సుమారుగా 1200 స్క్రీన్లలో విడుదల చేశారు.

Operation Valentine Expected Box Office Collections worldwide

పెయిడ్ ప్రీమియర్స్ తర్వాత ఆపరేషన్ వాలెంటైన్ మూవీ మిక్స్‌డ్ టాక్ సంపాదించుకొన్నది. దాంతో ఈ సినిమా ఆక్యుపెన్సీ కూడా మిశ్రమంగా కనిపించింది. మార్నింగ్ షోకు ఈ సినిమాకు 30 శాతం ఆక్యుపెన్సీ నమోదు కాగా, మ్యాట్నీ నుంచి పెరిగి 40 శాతానికి చేరుకొన్నది. ఫస్ట్ షో, సెకండ్ షోలకు 45 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.

ఇక ఆపరేషన్ వాలెంటైన్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా అమెరికాలో 150K డాలర్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో 2.5 కోట్ల గ్రాస్ వసూళ్లను, ఇండియాలో సుమారుగా 2 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా తొలి రోజు 4 నుంచి 5 కోట్ల మేర వసూళ్లను సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X