Operation Valentine 2 Days Collections: శనివారం షాకింగ్‌గా.. మొత్తం అన్ని కోట్లు.. ఇవేం కలెక్షన్లు!
నాగబాబు కుమారుడిగా సినిమాల్లోకి వచ్చి.. తనదైన సినిమాలతో విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. కెరీర్ ఆరంభం నుంచి కమర్షియల్ సినిమాలనే కాకుండా, విభిన్నమైన కథలతో వస్తున్న అతడు.. ఎన్నో హిట్లను అందుకున్నాడు.
కానీ, ఈ మధ్య కాలంలో పెద్దగా రాణించడం లేదు. దీంతో ఈ సారి హిట్ కొట్టాలన్న కసితో 'ఆపరేషన్ వాలెంటైన్' అనే మూవీ చేశాడు. దీనికి డీసెంట్ టాక్ వచ్చినా.. రెస్పాన్స్ మోస్తరుగానే వస్తోంది. మరి ఈ చిత్రం 2 రోజుల్లో ఎన్ని కోట్లు వసూళ్లను సాధించిందో మీరే చూసేయండి మరి!

ఆపరేషన్ వాలెంటైన్ అంటూ: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీనే 'ఆపరేషన్ వాలెంటైన్'. శక్తి ప్రతాప్ సింగ్ హడా తెరకెక్కించిన ఈ మూవీని సోని పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ రినైసెన్స్ పిక్చర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఇందులో మానుషి చిల్లర్ హీరోయిన్‌గా.. రుహానీ శర్మ, నవదీప్ కీలక పాత్రలను చేశారు. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చాడు.

వరుణ్ మూవీకి ప్రీ బిజినెస్: వరుణ్ తేజ్ నటించిన 'ఆపరేషన్ వాలెంటైన్' మూవీకి నైజాంలో రూ. 4.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 7.50 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 14.00 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా పస్ల్ ఓవర్సీస్‌లో రూ. 3 కోట్లతో కలిపి మొత్తంగా ఈ చిత్రానికి రూ. 17.00 కోట్లు బిజినెస్ జరిగింది.

రెండో రోజు అన్ని కోట్లతో: శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన 'ఆపరేషన్ వాలెంటైన్' మూవీకి రెండో రోజు కూడా మోస్తరు స్పందనే వచ్చింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ సినిమా రెండో రోజు రూ. 70 లక్షలు షేర్‌ను వసూలు చేసింది. వరల్డ్ వైడ్‌గా రూ. 90 లక్షలు రాబట్టింది. గ్రాస్ విషయానికి వస్తే ఈ చిత్రం రూ. 1.70 కోట్లు వసూలు చేసుకుంది.


Click it and Unblock the Notifications











