Operation Valentine 3 Days Collections: 3 రోజుల్లో అన్ని కోట్లు.. వరుణ్‌కు దెబ్బ.. హిట్ అవుతుందా అంటే!

తెలుగు చిత్ర పరిశ్రమలో డిఫరెంట్ సినిమాలతో ఎన్నో ప్రయోగాలు చేస్తూ వెళ్తున్న హీరోలు కొందరు మాత్రమే ఉన్నారు. అందులో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒకడు. కెరీర్ ఆరంభం నుంచీ ఇదే పంథాను ఫాలో అవుతోన్న అతడు.. వరుసగా విభిన్నమైన చిత్రాలనే చేస్తూ వస్తున్నాడు.

ఇలా ఇటీవలే 'ఆపరేషన్ వాలెంటైన్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి డీసెంట్ టాక్ వచ్చినా.. రెస్పాన్స్ మోస్తరుగానే వస్తోంది. ఫలితంగా కలెక్షన్లు ఆశించిన విధంగా రావట్లేదు. మరి ఈ చిత్రం 3 రోజుల్లో ఎన్ని కోట్లు వసూళ్లను సాధించిందో మీరే చూసేయండి!

Operation Valentine Movie 3 Days Worldwide Collections

ఆపరేషన్ వాలెంటైన్‌తో రాక: మెగా కాంపౌండ్ హీరో వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రమే 'ఆపరేషన్ వాలెంటైన్'. శక్తి ప్రతాప్ సింగ్ హడా తెరకెక్కించిన ఈ మూవీని సోని పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ రినైసెన్స్ పిక్చర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చాడు. ఇందులో మానుషి చిల్లర్‌ హీరోయిన్‌గా.. రుహానీ శర్మ, నవదీప్ కీలక పాత్రలను చేశారు.

Operation Valentine Movie 3 Days Worldwide Collections

వరుణ్ మూవీకి ప్రీ బిజినెస్: వరుణ్ తేజ్ హీరోగా చేసిన 'ఆపరేషన్ వాలెంటైన్'కు నైజాంలో రూ. 4.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 7.50 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 14.00 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా పస్ల్ ఓవర్సీస్‌లో రూ. 3 కోట్లతో కలిపి మొత్తంగా ఈ చిత్రానికి రూ. 17.00 కోట్లు బిజినెస్ అయింది.

Operation Valentine Movie 3 Days Worldwide Collections

3వ రోజు అలా.. మొత్తంగా: దేశ భక్తిని రగిలించే కథతో వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'ఆపరేషన్ వాలెంటైన్' సినిమాకు మూడో రోజు రెస్పాన్స్ కాస్త పెరిగింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి ఇది రూ. 80 లక్షలు వరకూ షేర్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాల్లో కలిపి రూ. 1.00 కోట్లు రాబట్టింది. ఇలా మూడు రోజుల్లో ఈ సినిమా కేవలం రూ. 3 కోట్లు లోపు షేర్‌నే కలెక్ట్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X