Operation Valentine 5 Days Collections: వరుణ్ మూవీ ఢమాల్.. 5 రోజుల్లో ఘోరంగా.. చెత్త రికార్డు దిశగా!

టాలీవుడ్‌లో తనదైన సినిమాలు చేస్తూ ప్రత్యేకమైన ఇమేజ్‌తో దూసుకుపోతోన్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఆ మధ్య కాలంలో వరుసగా హిట్లు మీద హిట్లు కొట్టిన అతడు.. ఇప్పుడు మాత్రం ఫ్లాపుల పరంపరతో ఇబ్బంది పడుతున్నాడు.

దీంతో ఈ సారి ఎలాగైనా బిగ్ సక్సెస్ సొంతం చేసుకోవాలన్న లక్ష్యంతో 'ఆపరేషన్ వాలెంటైన్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి డీసెంట్ టాక్ వచ్చినా.. రెస్పాన్స్ మోస్తరుగానే లభిస్తోంది. ఫలితంగా కలెక్షన్లు ఆశించిన విధంగా రావట్లేదు. మరి ఈ చిత్రం 5 రోజుల్లో ఎన్ని కోట్లు వసూళ్లను సాధించిందో మీరే చూడండి!

Operation Valentine Movie 5 Days Worldwide Collections

Recommended Video

Operation Valentine Boxoffice వరుణ్ మూవీ ఢమాల్..నష్టమెంత..? | Filmibeat Telugu

ఆపరేషన్ వాలెంటైన్‌ అంటూ: మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ఎయిర్‌ఫోర్ బ్యాగ్‌డ్రాప్ మూవీనే 'ఆపరేషన్ వాలెంటైన్'. శక్తి ప్రతాప్ సింగ్ హడా తెరకెక్కించిన ఈ మూవీని సోని పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ రినైసెన్స్ పిక్చర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇందులో మానుషి చిల్లర్‌ హీరోయిన్‌గా.. రుహానీ శర్మ, నవదీప్ కీలక పాత్రలు పోషించారు.

Operation Valentine Movie 5 Days Worldwide Collections

వరుణ్ మూవీకి ప్రీ బిజినెస్: వరుణ్ తేజ్ నటించిన 'ఆపరేషన్ వాలెంటైన్'కు నైజాంలో రూ. 4.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 7.50 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 14.00 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా పస్ల్ ఓవర్సీస్‌లో రూ. 3 కోట్లతో కలిపి మొత్తంగా ఈ చిత్రానికి రూ. 17.00 కోట్లు బిజినెస్ జరిగింది.

Operation Valentine Movie 5 Days Worldwide Collections

5వ రోజు ఎంత వచ్చింది?: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చేసిన సర్జికల్ స్ట్రయిక్స్ నేపథ్యంతో వచ్చిన 'ఆపరేషన్ వాలెంటైన్' మూవీకి మొదటి రోజు నుంచే అనుకున్న దానికంటే తక్కువ స్పందన వస్తోంది. రెండో రోజు నుంచి క్రమంగా డౌన్ అవుతోంది. ఇలా 5వ రోజు ఈ సినిమాకు చాలా తక్కువ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 15 లక్షలు షేర్, రూ. 25 లక్షలు గ్రాస్ రాబట్టింది.

5 రోజులకు కలిపి ఎంత?: వరుణ్ తేజ్ నటించిన 'ఆపరేషన్ వాలెంటైన్' మూవీకి ఐదు రోజుల్లో చాలా తక్కువగానే రెస్పాన్స్ లభించింది. ఫలితంగా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో డల్ వసూళ్లు రాబట్టింది. దీంతో నైజాంలో రూ. 97 లక్షలు, సీడెడ్‌లో రూ. 26 లక్షలు, ఆంధ్రా మొత్తంలో కలిపి రూ. 1.20 కోట్లు రాబట్టింది. ఇలా 5 రోజుల్లో ఈ సినిమా రూ. 2.43 కోట్లు షేర్, రూ. 4.50 కోట్లు గ్రాస్ రాబట్టింది.

Operation Valentine Movie 5 Days Worldwide Collections

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?: వరుణ్ తేజ్ నటించిన 'ఆపరేషన్ వాలెంటైన్' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో ఐదు రోజుల్లో రూ. 2.43 కోట్లు వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లలో కలుపుకుని రూ. 75 లక్షలు మాత్రమే వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే ఐదు రోజుల్లో ఈ చిత్రానికి రూ. 3.19 కోట్లు షేర్‌తో పాటు రూ. 5.80 కోట్లు గ్రాస్ మాత్రమే వచ్చింది.

Operation Valentine Movie 5 Days Worldwide Collections

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: 'ఆపరేషన్ వాలెంటైన్' సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 17.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 18.00 కోట్లుగా నమోదైంది. ఇక, 5 రోజుల్లో వరుణ్ తేజ్ సినిమాకు రూ. 3.19 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 14.81 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌ అవుతుంది. కానీ, ఇది భారీ నష్టాల దిశగానే సాగిపోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X