Operation Valentine 6 Days Collections: వరుణ్ మూవీ ఖేల్ ఖతం.. 6 రోజుల్లో ఇంతే.. కోట్ల నష్టాలు ఖాయం

తెలుగు చిత్ర పరిశ్రమలో కథల ఎంపికలో వైవిధ్యాన్ని చూపిస్తూ ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు చేసుకుంటూ వెళ్తోన్న హీరోల్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒకడు. కెరీర్ ఆరంభం నుంచీ ఇదే పంథాను ఫాలో అవుతోన్న అతడు.. ఈ మధ్య కాలంలో సరైన హిట్ కోసం చూస్తున్నాడు.

ఈ క్రమంలోనే ఇటీవలే వరుణ్ 'ఆపరేషన్ వాలెంటైన్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి డీసెంట్ టాక్ వచ్చినా.. రెస్పాన్స్ డల్‌గా లభిస్తోంది. ఫలితంగా కలెక్షన్లు పడిపోతూనే ఉన్నాయి. మరి ఈ చిత్రం 6 రోజుల్లో ఎన్ని కోట్లు వసూళ్లను సాధించిందో మీరే లుక్కేయండి!

Operation Valentine Movie 6 Days Worldwide Collections

రియల్ స్టోరీతో వచ్చిన మూవీ: మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన చిత్రమే 'ఆపరేషన్ వాలెంటైన్'. రియల్ స్టోరీతో శక్తి ప్రతాప్ సింగ్ హడా తెరకెక్కించిన ఈ మూవీని సోని పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ రినైసెన్స్ పిక్చర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇందులో మానుషి చిల్లర్‌ హీరోయిన్‌గా.. రుహానీ శర్మ, నవదీప్ కీలక పాత్రల్లో కనిపించారు.

Operation Valentine Movie 6 Days Worldwide Collections

వరుణ్ మూవీకి ప్రీ బిజినెస్: వరుణ్ తేజ్ 'ఆపరేషన్ వాలెంటైన్' సినిమాకు నైజాంలో రూ. 4.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 7.50 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 14.00 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా పస్ల్ ఓవర్సీస్‌లో రూ. 3 కోట్లతో కలిపి మొత్తంగా ఈ చిత్రానికి రూ. 17.00 కోట్లు బిజినెస్ అయింది.

Operation Valentine Movie 6 Days Worldwide Collections

6వ రోజు ఎంత వచ్చింది?: రియల్‌గా జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా రూపొందిన 'ఆపరేషన్ వాలెంటైన్' మూవీకి మొదటి రోజు నుంచే అనుకున్న దానికంటే తక్కువ రెస్పాన్స్ లభిస్తోంది. ఇలా 6వ రోజు ఈ సినిమాకు చాలా తక్కువ స్పందన వచ్చింది. దీంతో ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 10 లక్షలు షేర్, రూ. 20 లక్షలు గ్రాస్‌ను మాత్రమే వసూలు చేసుకుంది.

6 రోజులకు కలిపి ఎంత?: వరుణ్ తేజ్ నటించిన 'ఆపరేషన్ వాలెంటైన్' మూవీకి ఆరు రోజుల్లో చాలా తక్కువగానే రెస్పాన్స్ లభించింది. ఫలితంగా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో నిరాశ పరుస్తూనే ఉంది. తద్వారా నైజాంలో రూ. 1.01 కోట్లు, సీడెడ్‌లో రూ. 28 లక్షలు, ఆంధ్రా మొత్తంలో కలిపి రూ. 1.24 కోట్లు రాబట్టింది. ఇలా 6 రోజుల్లో ఈ సినిమా రూ. 2.53 కోట్లు షేర్, రూ. 4.70 కోట్లు గ్రాస్ రాబట్టింది.

Operation Valentine Movie 6 Days Worldwide Collections

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?: వరుణ్ తేజ్ నటించిన 'ఆపరేషన్ వాలెంటైన్' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో ఆరు రోజుల్లో రూ. 2.53 కోట్లు వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లలో కలుపుకుని రూ. 78 లక్షలు మాత్రమే వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 6 రోజుల్లో ఈ చిత్రానికి రూ. 3.32 కోట్లు షేర్‌తో పాటు రూ. 6.05 కోట్లు గ్రాస్ మాత్రమే వచ్చింది.

Operation Valentine Movie 6 Days Worldwide Collections

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: 'ఆపరేషన్ వాలెంటైన్' సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 17.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 18.00 కోట్లుగా నమోదైంది. ఇక, 6 రోజుల్లో వరుణ్ తేజ్ సినిమాకు రూ. 3.32 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 14.68 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌ అవుతుంది. కానీ, ఇది భారీ నష్టాల దిశగానే వెళ్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X