Operation Valentine Day 1 Collections: తొలి రోజే ఊహించని వసూళ్లు.. వరుణ్ ఎన్ని కోట్లు కొట్టాడంటే!

పెద్ద సినిమా నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమైనా.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకునేలా కష్టపడ్డాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ఎన్నో హిట్లను కొట్టిన ఈ యంగ్ హీరో.. తన రేంజ్‌ను భారీగా పెంచుకున్నాడు.

అయితే, ఈ మధ్య వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతుండడంతో ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలన్న లక్ష్యంతో 'ఆపరేషన్ వాలెంటైన్' అనే సినిమాతో వచ్చాడు. దీనికి మొదటి రోజు ఊహించని స్పందన వచ్చింది. మరి ఈ చిత్రం ఎన్ని కోట్లు వసూళ్లను సాధించిందో మీరే చూసేయండి!

Operation Valentine Movie Day 1 Worldwide Collections

మిషన్ ఆపరేషన్ వాలెంటైన్: మెగా ఫ్యామిలీకి చెందిన వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీనే 'ఆపరేషన్ వాలెంటైన్'. శక్తి ప్రతాప్ సింగ్ హడా తెరకెక్కించిన ఈ మూవీని సోని పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ రినైసెన్స్ పిక్చర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఇందులో మానుషి చిల్లర్‌ హీరోయిన్‌గా.. రుహానీ శర్మ, నవదీప్ కీలక పాత్రలను చేశారు. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు.

Operation Valentine Movie Day 1 Worldwide Collections

వరుణ్ మూవీకి ప్రీ బిజినెస్: వరుణ్ తేజ్ 'ఆపరేషన్ వాలెంటైన్' మూవీకి నైజాంలో రూ. 4.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 7.50 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 14.00 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా పస్ల్ ఓవర్సీస్‌లో రూ. 3 కోట్లతో కలిపి మొత్తంగా ఈ చిత్రానికి రూ. 17.00 కోట్లు బిజినెస్ అయింది.

Operation Valentine Movie Day 1 Worldwide Collections

డీసెంట్‌ టాక్‌తో తక్కువగా: దేశ భక్తి కథతో రూపొందిన 'ఆపరేషన్ వాలెంటైన్' మూవీ గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ డీసెంట్ టాక్ వచ్చింది. దీంతో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన కూడా ఆ రేంజ్‌లోనే అంటే పర్వాలేదనిపించేలా లభించింది. ఫలితంగా ఈ చిత్రానికి ఆశించిన రీతిలోనే మోస్తరు వసూళ్లు వస్తాయని అంచనాలు వేశారు.

Operation Valentine Movie Day 1 Worldwide Collections

తొలి రోజే ఊహించని వసూళ్లు: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, శక్తి ప్రతాప్ సింగ్ హడా తెరకెక్కించిన 'ఆపరేషన్ వాలెంటైన్' మూవీకి మొదటి రోజే మోస్తరు స్పందన లభించింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి ఈ సినిమా రూ. 1 కోట్లు షేర్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్‌గా రూ. 1.60 కోట్లు వరకూ రాబట్టింది. గ్రాస్ పరంగా చూసుకుంటే ఇది మొదటి రోజు రూ. 3 కోట్లు వరకూ కలెక్ట్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X