ఆపరేషన్ వాలెంటైన్‌కు షాకింగ్ బిజినెస్: ఆ మూవీల కంటే తక్కువ.. అన్ని కోట్లు వస్తేనే వరుణ్‌కు హిట్

పెద్ద పేరున్న మెగా ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి వచ్చినా.. తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ.. మూవీ మూవీకీ తన రేంజ్‌ను పెంచుకుంటూ వెళ్తున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఇలా ఆ మధ్య వైవిధ్యమైన సినిమాలతో వరుస హిట్లను ఖాతాలో వేసుకున్న అతడు.. గత రెండు చిత్రాలతో మాత్రం ఎదురుదెబ్బలు తిన్నాడు.

దీంతో ఈ సారి ఎలాగైనా సక్సెస్ సాధించాలన్న పట్టుదలతో 'ఆపరేషన్ వాలెంటైన్' మూవీ చేశాడు. అసలు ఈ సినిమా ఎంత థియేట్రికల్ బిజినెస్ చేసింది? ఎన్ని కోట్లు వస్తే హిట్‌గా నిలుస్తుంది? అనే వివరాలను చూద్దాం పదండి!

 Operation Valentine Movie Worldwide Pre Release Business Details

ఎయిర్‌ఫోర్స్ మూవీతో వరుణ్: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ఎయిర్‌ఫోర్స్ బ్యాగ్రౌండ్ మూవీనే 'ఆపరేషన్ వాలెంటైన్'. శక్తి ప్రతాప్ సింగ్ హడా తెరకెక్కించిన ఈ మూవీని సోని పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ రినైసెన్స్ పిక్చర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఇందులో మానుషి చిల్లర్‌ హీరోయిన్‌గా.. రుహానీ శర్మ, నవదీప్ కీలక పాత్రలను చేశారు. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించాడు.

అలాంటి స్టోరీ.. ఫుల్ యాక్షన్‌: వరుణ్ తేజ్ నటించిన 'ఆపరేషన్ వాలెంటైన్' మూవీ దేశ భక్తితో కూడిన యాక్షన్‌తో రూపొందింది. టెర్రరిస్ట్ దాడి తర్వాత భారత వైమానిక దళం చేసిన సర్జికల్ స్ట్రయిక్ నేపథ్యంతో ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో ఓ సాహసోపేత ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్‌గా వరుణ్ తేజ్ నటించాడు. దీంతో ఈ చిత్రం ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకట్టుకుని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కింది.

 Operation Valentine Movie Worldwide Pre Release Business Details

రిలీజ్‌కు రెడీ.. సందడిగానే: క్రేజీ కాంబోలో రూపొందిన 'ఆపరేషన్ వాలెంటైన్' మూవీని మార్చి 1వ తేదీన ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఇక, ఎప్పటి నుంచో ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ సందడి కనిపిస్తోంది. ఈ సినిమా కోసం థియేటర్లను ముస్తాబు చేస్తూ.. ఫ్లెక్సీలు రెడీ చేస్తూ ఫ్యాన్స్ తెగ రచ్చ చేస్తున్నారు. కానీ, బుకింగ్స్ విషయంలో కూడా ఈ సినిమా డీసెంట్ రెస్పాన్స్‌ను అందుకుంటోంది.

హక్కులకు మంచి డిమాండ్: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన 'ఆపరేషన్ వాలెంటైన్' మూవీపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి ఏది విడుదలైనా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ నెలకొంది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల రైట్స్ మంచి ధరలకే అమ్ముడుపోయాయని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

 Operation Valentine Movie Worldwide Pre Release Business Details

ఏపీ, తెలంగాణలో బిజినెస్: వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'ఆపరేషన్ వాలెంటైన్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో మంచి బిజినెస్ జరిగింది. ట్రేడ్ లెక్కల ప్రకారం.. ఈ సినిమా నైజాంలో రూ. 4.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.00 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 7.50 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్‌ను చేసుకుంది. ఇలా రెండు రాష్ట్రాల్లో కలిసి దీనికి రూ. 14 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

వరల్డ్ వైడ్ బిజినెస్ ఇలా: 'ఆపరేషన్ వాలెంటైన్' మూవీకి ఆరంభంలోనే మంచి హైప్ ఏర్పడింది. దీంతో ఈ సినిమా హక్కులు కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్ ఏరియాల హక్కులు రూ. 3.00 కోట్లకు అమ్ముడుపోయాయి. దీంతో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 17 కోట్లు వ్యాపారం జరిగింది. అంటే ఇది హిట్ అవ్వాలంటే మాత్రం రూ. 18 కోట్లు షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది.

 Operation Valentine Movie Worldwide Pre Release Business Details

ఆ సినిమాల కంటే తక్కువ: రవితేజ నటించిన 'ఆపరేషన్ వాలెంటైన్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 17 కోట్లు బిజినెస్ జరిగింది. తద్వారా ఈ మధ్య కాలంలో అతడి నుంచి వచ్చిన తక్కువ బడ్జెట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అతడి కెరీర్‌లో 'గని' రూ. 25.30 కోట్ల బిజినెస్‌తో టాప్‌లో ఉంది. తర్వాత గద్దలకొండ గణేష్, తొలిప్రేమ, అంతరిక్షం, గాంఢీవధారి అర్జున సినిమాలు ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X