5400 కోట్లు కొల్లగొట్టిన హాలీవుడ్ సెన్సేషనల్ మూవీ.. ఇండియాలో ఎన్ని వసూలు చేసిందంటే?
అణుబాంబు సృష్టికర్త ఒప్సెన్‌హైమర్ జీవిత కథ ఆధారంగా రూపొందిన బయోగ్రాఫికల్ మూవీ ఒప్పెన్‌హైమర్. హిరోషిమా, నగాసకి నగరాలపై అణుబాంబు దాడి అనంతరం నెలకొన్న పరిస్థితులు, అమెరికాలో రాజకీయాలు, శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకుల మధ్య జరిగిన కోల్డ్ వార్ నేపథ్యంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా థియేట్రికల్ రన్‌లో ఏ మేరకు కలెక్షన్లు సాధించింది? ఇండియాలో ఎన్ని కోట్లు? ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్లు వసూలు చేసిందనే వివరాల్లోకి వెళితే..
ఒప్పెన్‌హైమర్ (Oppenheimer) సినిమా బడ్జెట్ విషయానికి వస్తే.. భారీ బడ్జెట్‌తో నిర్మించారు. క్రిస్టఫర్ నోలన్ సినిమాను రాబర్ట్ డౌనీ జూనియర్, సిలియన్ మర్ఫి లాంటి అగ్ర నటులతో తెరకెక్కించారు. ఈ సినిమాను దాదాపు 100 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో 820 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఇక ఈ సినిమాకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని దాదాపు 1200 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

ఒప్పెన్‌హైమర్ (Oppenheimer) సినిమాకు ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ఇండియాలో ఈ సినిమాకు మంచి ఒపెనింగ్స్ లభించాయి. ఈ సినిమా తొలివారం 73 కోట్ల రూపాయలకుపైగా, రెండోవారం 30 కోట్లు, మూడో వారం 17 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ఇండియాలో టోటల్ థియేట్రికల్ రన్‌లో సుమారుగా 120 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
ఒప్పెన్‌హైమర్ (Oppenheimer) సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. యూకే, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా దేశాలతో భారత్ పోటీపడింది. నార్త్ అమెరికా, ఇతర దేశాలను మినహాయిస్తే.. ఈ సినిమా ప్రపంచస్థాయిలో అత్యుత్తమ వసూళ్లు సాధించిన 5వ దేశంగా రికార్డు సాధించింది.

ఇక ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. నార్త్ అమెరికా మినహాయించి ఇతర దేశాల్లో రికార్డు స్థాయి వసూళ్లను సాధించింది. ఈ సినిమా ఓవర్సీస్‌లో 231 మిలియన్ డాలర్లు అంటే 3200 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అమెరికాలో 200 మిలియన్ డాలర్లు రాబట్టింది. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 5400 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. అయితే టాప్ 10లో చేరుతుందని ఆశించిన వారికి ఈ సినిమా నిరాశను మిగిల్చింది.

హాలీవుడ్ టాప్ 10 మూవీస్ విషయానికి వస్తే.. అత్యథికంగా వసూళ్లు సాధించిన చిత్రంగా జురాసిక్ వరల్డ్ మొదటి స్థానంలో, స్పైడర్ మ్యాన్: నో వే హోమ్ రెండో స్థానంలో, అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్, స్టార్ వార్స్, టైటానిక్, అవతార్: ది వే ఆఫ్ వాటర్, అవెంజర్స్: ఎండ్ గేమ్, అవతార్ చిత్రాలు ఆ తర్వాత స్థానంలో నిలిచాయి.


Click it and Unblock the Notifications











